యువహీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన తండ్రి సినిమా ఫీల్డ్‌లో మంచి పలుకుబడి, డబ్బు, ఫైనాన్షిర్ల అండ దండిగా ఉన్న బెల్లకొండ సురేష్ అన్న సంగతి తెలిసిందే. ఇంత కాలం బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి హీరోలను నమ్ముకున్న ఆయన తన ఇంట్లోనే ఓ కుర్రాడు అదేనండీ హీరో ఉన్నాడని భావించి, అతడిని కమర్షియల్ హీరోగా చేస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. దాంతో ఆయన తన కొడుక్కి నటనలో తర్ఫీదు ఇప్పించాడు.
ఇక తన కొడుకు మొదటి సినిమాను భారీగా తీయాలని భావించి, డబ్బుకు వెనుకాడకుండా వి.వి.వినాయక్‌ని దర్శకునిగా తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని వినాయక్ ఒప్పుకోవడానికి కారణం ఆయనకు మొదటి చాన్స్ దర్శకునిగా 'ఆది'తో ఇచ్చింది బెల్లంకొండ సురేషే. దాంతో ఆయన కుమారుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను వినాయక్ స్వీకరించాడు. తమన్నాని ఐటం సాంగ్‌లో తీసుకుని మెయిన్ హీరోయిన్‌గా టాప్ హీరోయిన్ సమంతను తీసుకుని భారీ ఎత్తున చిత్రం తీశాడు. ఈ చిత్రం ఓకే అనిపించినా నిర్మాతగా నష్టాలనే మిగిల్చింది.
ఇక రెండో చిత్రం బయటి చిత్రం. అదే 'స్పీడున్నోడు' అది ఫ్లాప్. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను వంటి కమర్షియల్ దర్శకునితో 'జయ జానకి నాయకా' తీస్తున్నాడు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆయనకు జోడీ. నిర్మాత మిర్యాల రెడ్డే అనుకుందాం. కానీ ఈ చిత్రం ఫంక్షన్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, తన గురించి బోయపాటి తెలుసుకుని తనతో చిత్రం చేస్తానని వచ్చాడట.
మరీ ఇలా ఎలా చెబుతావు బెల్లకొండ? ముందుకు మీకిచ్చిన కమిట్‌మెంట్, అడ్వాన్స్ వల్లనే బోయపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మొదట ఆగిపోయింది. మరలా మొదలైంది. ఇంతకాలం తర్వాత కూడా బోయపాటి తన మాటకు కట్టుబడ్డాడు. బాలయ్య 100వ చిత్రాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక తన మొదటి చిత్రం 'అల్లు డుశీను' విడుదల సమయంలో కూడా తాను శిక్షణ తీసుకున్న తర్వాత తనలోని ప్రతిభ నచ్చి వినాయకే అడిగాడని చెప్పాడు.. బాబూ.. అందరికీ తెలుసు.. పెద్దపెద్ద వాళ్లు నీకెందుకు పనిచేస్తున్నారో..? అందులో తప్పులేదు గానీ మరీ ఇలా చెబితే వినేవారు నవ్వుకుంటారు. జర జాగ్రత్త బ్రదర్.. అందులో ఇప్పుడు సోషల్‌మీడియా బాగా ఊపులో ఉంది. ఇప్పటికే నీ వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి.