ఎప్పుడైతే స్టార్ మా టీవీ తమ 'బిగ్‌బాస్'షోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఓకే చేసిందో అప్పటి నుంచి ఈ కార్యక్రమంపై హైప్స్ బాగా క్రియేట్ అయ్యాయి. బుల్లితెర కార్యక్రమం అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలకు ధీటుగా ఈ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే కొంటెగా కన్నుగీటుతూ కనిపిస్తున్న యంగ్‌టైగర్ తన లుక్‌తో బీభత్సమైన హైప్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ షో ప్రోమోను కూడా స్టార్ మా టీవీ భారీఎత్తున రీలీజ్ చేసింది.
ఇందులో వస్తున్న థీమ్ మ్యూజిక్, గ్రాఫిక్స్ జోడింపు వరకు అన్ని అదరహో అనే లెవల్‌లో ఉన్నాయి. ఈ థీమ్‌జేమ్స్‌బాండ్ చిత్రాల ధీముల మాదిరి ఉంది. దీనిని తమనే అందించి ఉంటే అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చివరలో కోట్‌కు బటన్ పెట్టుకుంటూ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా యంగ్‌టైగర్ తన కోటుకి బటన్ పెట్టుకుంటూ ప్రోమోకు అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
మొత్తానికి ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చుపెడుతున్నారు.. ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. అనే విషయాలను పక్కనపెడితే జూనియర్‌ని ఎంచుకోవడం వల్లే ఈ కార్యక్రమానికి ఇంత హైప్ క్రియేట్ అవుతోంది అన్న మాట మాత్రం వాస్తవం.