Advertisementt

ఇప్పుడు ఈ కమెడియన్‌ హవా నడుస్తోంది!

Sun 18th Jun 2017 01:46 PM
vennela kishore,star comedian,tollywood comedian  ఇప్పుడు ఈ కమెడియన్‌ హవా నడుస్తోంది!
Comedian Vennela Kishore Hikes his Remuneration ఇప్పుడు ఈ కమెడియన్‌ హవా నడుస్తోంది!
Advertisement
Ads by CJ

బ్రహ్మానందం ఏలుబడి ఎత్తుబడిగా మారింది. ఇక ఈయన మరలా పుంజుకోవడం కష్టమే. ఇప్పటికే 400కోట్ల దాకా సంపాదించిన ఆయన ఇక తన కొడుకు గౌతమ్‌ని హీరోగా నిలబెట్టేందుకు ఆ డబ్బులను వినియోగించుకుంటే బాగుంటుంది. ఇక వయసు ముదిరిన అలీకి పవన్‌ సినిమాల తప్ప అవకాశాలు లేవు. దాంతో ఆయన పలు ఫంక్షన్లకు హోస్ట్‌గా, బుల్లితెరపై ఫిక్స్‌ అయిపోయాడు. సునీల్‌ హిట్‌ కాకపోయిన ఫర్వాలేదు అక్కడే ఉంటానంటున్నాడు. 

సప్తగిరి, కృష్ణ భగవాన్‌లతో పాటు 30 ఇయర్స్‌ పృథ్వీ పని కూడా ఖాళీ. వీరు చేసే ఓవర్‌యాక్షన్లు, పేరడీలు, స్ఫూప్‌లు చూసి చూసి బోరు కొట్టింది జనాలకి. ఇక 'జబర్దస్త్‌' ఆర్టిస్టుల పని ఒకటి రెండు చిత్రాలకే పరిమితం, దీనిని షకలక శంకర్‌, ధన్‌రాజులు నిరూపించారు. దీంతో మన హీరోలకు స్నేహితులు దొరకడం లేదు. దానికిక వెన్నెల కిషోర్‌ నేనున్నాను అంటున్నాడు. ఈయన మహేష్‌ నుంచి కిందిస్థాయి హీరోల వరకు స్నేహితుడైపోయాడు. ఈ టైమ్‌ గ్యాప్‌లోనే బ్రహ్మానందం రేంజ్‌లో కాకపోయినా మరలా తానే సొంతగా నిర్మాతగా మారి, తానే హీరోగా నటించేంత సంపాదించాలని డిసైడ్‌ అయినట్టున్నాడు.

నిన్నటివరకు అతనిరోజు కాల్షీట్‌ 50వేల లోపలే. నేడు 2లక్షల పైమాటే. దీన్నిబట్టి చూస్తే ఇక్కడ సంపాదించింది మరలా హీరోగా, నిర్మాతగా, వీలుంటే దర్శకునిగా మారి ఇక్కడే పోగొట్టుకునే తత్వం బాగాకనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఏకంగా 50వేల నుంచి 2లక్షలకు పైగా చెబుతుండటం చూస్తుంటే అత్యాశపడిన ఏ కమెడియన్‌ బాగుపడిన చరిత్ర సినిమా ఫీల్డ్‌లో లేదనే డైలాగ్‌ రాయాలనిపిస్తోంది.

Comedian Vennela Kishore Hikes his Remuneration:

Vennela Kishore Hiked Remuneration after Rarandoi Veduka Chuddam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ