స్టార్ మా టీవీ కోసం వినూత్నంగా సల్మాన్‌ను, కమల్‌ను మరిపించేలా 'బిగ్‌బాస్' షోని సక్సెస్ చేసి తన సత్తా ఏంటో చూపాలని జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు. కేవలం తాను భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడంతోనే సరిపెట్టకుండా ఈ షోకి సంబంధించిన సెట్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అన్ని ఎన్టీఆర్ చెప్పిన ప్రకారమే జరుగుతున్నాయి. తాము నిర్వహించిన చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను అంతా తామై నడిపించినా సక్సెస్ కాకపోవడంతో ఈ 'బిగ్‌బాస్' విషయంలో షో నిర్వాహకులు తమ తప్పులేకుండా అన్నింటిని జూనియర్ వేలు పెడుతున్నా అభ్యంతరం చెప్పడం లేదట. ఎందుకంటే తీరా షో ఫ్లాప్ అయితే షో నిర్వాహకుల తప్పిదాల వల్లే షో ఫెయిల్ అయింది అనే రిమార్కు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇప్పటికే ఈ షో సెట్స్ ఎలా ఉండాలో? ఎంత రిచ్‌గా,ఆకర్షణీయంగా ఉండాలో ఎన్టీఆరే నిర్దేశించాడు. ఇక తాజాగా ఈ షో థీమ్ సాంగ్ కోసం నిర్వాహకులు హిందీ 'బిగ్‌బాస్'కి సంగీతం ఇచ్చిన వ్యక్తికి అప్పగించాలని చూసినప్పటికీ అతని వల్ల ఉపయోగం లేదని చెప్పిన ఎన్టీఆర్ టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీగా ఉన్న తమన్‌కి ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్దేశించడంతో నిర్వాహకులు కూడా ఓకే చేశారు. ఈ థీమ్‌సాంగ్‌కి ఆల్‌రెడీ తమన్ ట్యూన్ కూడా రెడీ చేసేశాడు. మరోవైపు ఈ చిత్రం కెమెరామెన్ బాధ్యతలను కూడా తన సన్నిహితుడైన టాలెంటెడ్ టెక్నీషియన్ పేరునే ఎన్టీఆర్ రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తమన్.. ఎన్టీఆర్‌కి 'బృందావనం, బాద్‌షా, రామయ్యా..వస్తావయ్యా' వంటి సినిమాలకు మంచి సంగీతం అందించి ఉండటం విశేషం...!