మెగాస్టార్ చిరంజీవి. సుమారు 30 సంవత్సరాల పాటు నెంబర్‌వన్ హీరోగా టాలీవుడ్‌కి తన స్టామినా చూపించాడు. తర్వాత కొద్దికాలం పాటు గ్యాప్ ఇచ్చినా..ఆ స్థానాన్ని, స్థాయిని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబుల పేర్లు ఈ నెంబర్ కోసం పోటీపడినా..వరుస హిట్స్ ఇవ్వడంలో ఇద్దరూ ఫెయిల్ అయ్యి..ఆ స్థాయిని అందుకోలేక పోయారు. దీంతో ఎవరి సినిమా రిలీజ్ అయితే..ఆ టైమ్‌కి వాళ్లే నెంబర్‌వన్ హీరో అన్నట్లుగా టాలీవుడ్‌లో కొంతకాలం నడిచింది. అయితే చిరు రీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ ఆ స్థానం గురించి మాటల్లేవ్. మాట్లాడుకోవడాలు ల్లేవ్.
అయితే బాహుబలి పుణ్యమా అని, అసలు నెంబర్ వన్ ప్లేస్ గురించి మాట్లాడుకునే అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు నెంబర్‌వన్ హీరో అని ఎవరైనా చెప్పుకుంటే బాహుబలిని బీట్ చేయాలి. అంత స్టామినా ఇప్పుడప్పుడే ఏ హీరోకి లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నాన్ బాహుబలి అని కొత్తగా లెక్కలు మొదలెట్టారు. ఇప్పుడున్న నాన్ బాహుబలి లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్ 'ఖైదీ నెంబర్ 150'. కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది క్లారిటీ లేకపోయినా..నాన్ బాహుబలి లిస్ట్‌లో మాత్రం చిరంజీవి సినిమానే నెంబర్‌వన్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడీ స్థానం కోసమే బన్నీ చూస్తున్నట్లుగా వినిపిస్తుంది.
హరీష్‌శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన 'దువ్వాడ జగన్నాధం' చిత్రంతో నాన్ బాహుబలి లిస్ట్‌లో అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌ని చేరుకుంటాడని, అంత అద్భుతంగా సినిమా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సో..నాన్ బాహుబలి ని బీట్ చేయడమంటే చిరంజీవి 'ఖైదీ..'ని బీట్ చేయడమేగా మరి. అది చిరు చిత్రమేగా....!