తాజాగా స్టార్ మా చానెల్ కోసం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ అవతారం ఎత్తనున్నాడు. స్టార్‌మా ప్రతిష్టాత్మకంగా దీనిని భావిస్తోంది. దాంతో షో నిర్వాహకులతో పాటు జూనియర్ కూడా ఈ 'బిగ్‌బాస్'ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాడు. అసలు ఒప్పుకోడు.. ఒప్పుకుంటే సాధించే దాకా నిద్రపోని పౌరుషం ఉన్న వాడిగా జూనియర్‌ని పలువురు సన్నిహితులు చెబుతుంటారు.
మరోపక్క దేశవ్యాప్తంగా 'బాహుబలి'తో పాపులరైన 'భళ్లాలదేవ' దగ్గుబాటి రానా జెమినీకి 'నెం1యాయిరే' చేయనున్నాడు.దీంతో హాట్‌సీట్‌ను ఎక్కనున్న ఈ ఇద్దరిలో ఎవరు మెప్పిస్తారు? అనేది తాజాగా టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశం అయింది. కానీ కోలీవుడ్ రూటే సపరేట్. వారు ఒకప్పుడు రజినీ-చిరులను పోలుస్తూ, వారి కలెక్షన్లు, ఇమేజ్‌ల గురించి మీడియాలో పెద్దపెద్ద చర్చలే నడిపి, రజినీకి తమిళంతో పాటు కన్నడ, మలయాళంతో పాటు ఉత్తరాదిలో కూడా వీరాభిమానులున్నారని, ఇక చిరు కేవలం తెలుగుకే పరిమితమై హిందీలో రాణించలేకపోవడంతో తమ తలైవానే గ్రేట్ అని తేల్చారు.
ఇక తమలోని కమల్ హాసన్, విక్రమ్ వంటి వైవిధ్యనటులు తెలుగులో లేరని, వారికి ఎన్టీఆర్, ఏయన్నార్ ఉంటే తమకు ఎంజీఆర్, శివాజీగణేషన్‌లు ఉన్నారని వాదించేవారు. ఇక మణిరత్నం, శంకర్‌లే గ్రేట్ అనే వారు. కానీ వారు దాసరి, కె.విశ్వనాథ్‌తో పాటు పలువురిని మచ్చిపోయారు. ఇక కమల్ బాలచందర్‌తో ఎంత గొప్ప చిత్రాలు చేశాడో, కె.విశ్వనాథ్‌తో కూడా అంతటి కళాఖండాలు చేశారు.
ఇక విక్రమ్‌కి మొదటగా చిన్న చితకా అవకాశాలిచ్చింది కూడా తెలుగే. రజినీ, కమల్‌లు కూడా తెలుగులో స్ట్రెయిట్‌గా నటిస్తే మనవారు ఆదరించారు. ఇక ఇప్పుడు తమిళంలో 'బిగ్‌బాస్'ని కమల్‌హోస్ట్ చేస్తున్నాడు. తెలుగులో ఆ బాధ్యత జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. కమల్‌ని, జూనియర్‌ని అసలు పోల్చకూడదు. కానీ అప్పుడే కోలీవుడ్ మీడియాలో కమల్-జూనియర్‌కి పోటీ అని కథనాలు వస్తున్నాయి. చూద్దాం.. కమల్‌ని జూనియర్ ఓడిస్తే అప్పుడొచ్చే కిక్కే వేరప్పా..!