చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరగరాయాలన్నా మేమే.. ట్రెండ్‌ని ఫాలో కావడం కాదు.. ట్రెండ్‌ని క్రియేట్ చేయాలి అనే డైలాగులు తమ మెగా కాంపౌండ్ హీరోలకే దక్కుతుందని మెగాభిమానులు అంటున్నారు. ఏయన్నార్‌ని పక్కనపెడితే ఆ తర్వాత చిరుతోనే డ్యాన్స్‌లు, స్టెప్పుల ట్రెండ్ మొదలైందని, ఇక ఆడియో వేడుకల స్థానంలో ప్రీరిలీజ్ వేడుకలను చూసి తమను చూసే పక్కవారు ఫాలో అవుతున్నారని వారు వాదిస్తున్నారు.
తాజాగా వారు మరో అంశంలో మా హీరోలే ట్రెండ్ సృష్టిస్తున్నారని గొప్పలు పోతున్నారు. ఇంతకాలం ఏ చిత్రం ప్రారంభోత్సవం అయినా పలువురి పెద్దలు, ముఖ్యులు, అతిధుల సమక్షంలో ఒకరు క్లాప్‌కొట్టడం, ఒకరు ఫస్ట్‌షాట్‌కి దర్శకత్వం వహించడం, మరోకరు సిచ్చాన్ చేయడం అనేవి చాలాకాలంగా సాంప్రదాయంగా వస్తున్నాయి. కానీ ఇటీవల మెగా కాంపౌండ్ హీరోలు తమ చిత్రాల ప్రారంభోత్సవాలను తమ తల్లిదండ్రుల చేతనే చేయిస్తున్నారు.
వరుణ్‌తేజ్ సినిమా అంటే నాగబాబు గ్యారంటీ.. సాయి ధరమ్ తేజ్ సినిమా అంటే వాళ్ల అమ్మ షూర్. రామ్ చరణ్ సినిమా అంటే చిరంజీవి-సురేఖ మస్ట్. ఇప్పుడు తాజాగా బన్నీ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఓపెనింగ్‌కి అల్లు అర్జున్ తల్లిదండ్రులే అన్ని, అలా తమ తల్లిదండ్రులను మించి తమ మంచి కోరేవారు ఎవ్వరూ ఉండరని, తమ హీరోలు తమ తల్లిదండ్రులకు ఇస్తున్న విలువ ముచ్చటేస్తోందని మెగాభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.