'డిజె' (దువ్వాడ జగన్నాథం). ఇప్పుడు ఈ చిత్రం టాలీవుడ్‌లో మోస్ట్ అవేయిటింగ్ మూవీ అనడంలో సందేహం లేదు. ఒకవైపు వరుస విజయాలలో ఉన్న బన్నీ, మరోవైపు దిల్‌రాజులు కలవడం, హరీష్ శంకర్, దేవిశ్రీలు తోడవ్వడంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. పాటలు మారుమోగిపోతున్నాయి.
చివరకు ఈ చిత్రం పుణ్యమా అని 'ముకుందా,ఓ లైలా కోసం, మొహంజదారో'లు ఫ్లాప్ అయినా పూజాహెగ్డే పేరు కూడా మారుమోగుతోంది. ఈ చిత్రంలో బన్నీకి ధీటుగా ఆమె వేసిన స్టెప్స్‌ని ఇప్పటికే చూసిన పలువురు నిర్మాతలు, దర్శకులు పూజా కాల్షీట్స్ కోసం వెయిటింగ్. ప్రభాస్ 'సాహో' నుంచి మహేష్-వంశీపైడిపల్లి-దిల్‌రాజు-అశ్వనీదత్‌ల మూవీలో కూడా ఆమెనే హీరోయిన్‌గా రిపీట్ చేయాలని దిల్‌రాజు భావిస్తున్నాడట. అన్ని నచ్చితే దిల్‌రాజు ఏ హీరోను, ఏ హీరోయిన్‌ని కూడా ఒక్క సినిమాతో సరిపెట్టడు.
ఇక తాజాగా 'డిజె'కు సంబంధించిన మరో పవర్ ఫుల్ సెంటిమెంట్ బయటకు వచ్చింది. 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం ఊపులో సినిమాల మార్కెట్ పెరిగి, ఆ తర్వాత వచ్చిన అతి పెద్ద చిత్రం 'శ్రీమంతుడు' నాడు నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. అలా చూసుకుంటే 'బాహుబలి-ది బిగినింగ్' కన్నా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' ఇంకా పదింతలు హిట్టు.
దాంతో దీని తర్వాత వస్తున్న అతి పెద్ద చిత్రం 'డిజె'పై కూడా ఆటోమేటిగ్గా పాజిటివ్ బజ్ వచ్చి మరోసారి నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన చిరు 'ఖైదీ నెంబర్ 150'కంటే 'డిజె' ఎక్కువకలెక్షన్లు వసూలు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాస్త దమ్మున్న కథకి హరీష్ శంకర్ స్టైల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోడై పాజిటివ్ టాక్ వస్తే అది పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు.ఇక ఈ చిత్రానికి కేవలం విడుదలకు ముందే దిల్‌రాజుకు 25కోట్ల ప్రాఫిట్ వచ్చిందంటున్నారు.