ఆ మధ్యలో మహేష్ బాబు 'స్పైడర్' ఫస్ట్ లుక్, టీజర్ కోసం ఎన్నో రోజులు అర్రులు చాచేలా ఎదురు చూసిన అభిమానులకు ఎట్టకేలకు 'స్పైడర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. అలాగే టీజర్ ని కూడా అదిగో ఇదిగో అంటూ విడుదల చేశారు. ఇలా 'స్పైడర్' టీజర్ విడుదల చేశారో లేదో అలా సెన్సేషన్ సృష్టించేసింది. ఈ టీజర్ తో సినిమా పిచ్చ హైప్ క్రియేట్ అయ్యింది. మరి అప్పట్లో అభిమానులను మహేష్ బాబు బాగా వెయిట్ చేయించాడు. కానీ ఇప్పుడు మహేష్ అభిమానులకు ఒక శుభవార్త చెబుతున్నాడు.
ఒక్క టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన స్పైడర్ చిత్రం ఇప్పుడు మరొక టీజర్ వదలడానికి రెడీ అయ్యిందట. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్ర టీజర్ ని 167 ఫ్రేమ్ లతో తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొదటి టీజర్ లో 'స్పైడర్' కి సంబందించిన స్టోరీ ఏమాత్రం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న మురుగదాస్ రెండో టీజర్ లో కూడా 'స్పైడర్' స్టోరీని బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు.
అయితే ఇప్పుడు విడుదల చేసే టీజర్ లో మహేష్ కి రెండు మూడు డైలాగ్స్ కూడా చెబుతాడని టాక్ వినబడుతుంది. మరి మహేష్ ని టీజర్లో చూస్తేనే ఎర్రిక్కిపోయిన మహేష్ అభిమానులు ఇప్పుడు డైలాగ్స్ వింటే ఇంకెలా రెచ్చిపోతారో. అయితే ఈ టీజర్ ని కట్ చెయ్యడానికి మురుగదాస్ మాత్రం ప్రత్యేక శ్రద్దతీసుకుంటున్నాడట. అయితే 'స్పైడర్' రెండో టీజర్ ని మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదల చేసి సినిమాని దసరాకు విడుదల చేస్తారట. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుంది.