నారారోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది అనే నలుగురు కుర్రహీరోలతో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శమంతకమణి' ఫస్ట్‌లుక్స్ నుంచి టీజర్ వరకు అన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం టీజర్‌ను చూస్తే రెండు విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకటి 'శమంతకమణి' ఏమిటి? అనేదానిని రివీల్ చేయలేదు. బహుశా పాతకాలం నాటి కారు కావచ్చనే చర్చ సాగుతోంది. ఇక టీజర్‌లో ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే నారా రోహిత్ లుక్.
నారా రోహిత్‌పై 'బాణం' చిత్రం నుంచి ఫిజిక్‌ని పట్టించుకోవడం లేదని పలు విమర్శలు వస్తున్నాయి. నారా రోహిత్ తాను నటించే ప్రతి చిత్రాన్ని డిఫరెంట్‌గా ఉండేలా చేసుకుంటూ బాగా నటనలో ఇంప్రూవ్ అవుతున్నాడు. కానీ చాలా లావుగా కనిపిస్తున్నాడు. కెరీర్ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా లావుగా ఉండటం వల్లే కలిసొచ్చిందని నమ్మి ఇలా రోహిత్ తయారవుతున్నాడేమో అనే కామెంట్స్ కూడా రోహిత్ పై ఈ మధ్య వినిపించాయి.
అయితే తాజాగా రోజుకు ఆరేడు గంటలకు పైగా కష్టపడి నారా రోహిత్ దాదాపు 15కిలోల వరకు తగ్గాడట. ఆయన దీని కోసం పడిన తపన చూసి అందరూ ఎంతో ఆశ్యర్యపోయారట. సో.. మొత్తానికి నారారోహిత్ మాత్రం తన ఫిజిక్‌ను బాగానే మార్చుకున్నాడు. అనవసరపు కృత్రిమ ఆపరేషన్ల జోలికి పోకుండా ఇంకో ఐదారు కేజీలు తగ్గితే మాత్రం కుర్రాడు లవ్, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నింటికీ ఫిట్ అవుతాడని చెప్పవచ్చు...!