గత కొన్నాళ్ల నుండి వరుస హిట్స్ తో సక్సెస్ బాట పట్టిన నితిన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 'అఆ' సినిమాతో కెరీర్ లోనే భారీ హిట్టందుకున్న నితిన్ తాజాగా హను రాఘవపూడి డైరెక్షన్ లో 'లై' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా నటిస్తున్న మేఘ ఆకాష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చాలావరకు అమెరికాలోనే జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'లై' సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
మరి ఇన్ని అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కొంతమంది నితిన్ తీసుకున్న నిర్ణయం పై కాస్త డౌట్ పడుతున్నారు. ఎందుకంటే 'లై' సినిమా సంగీతానికి మణిశర్మ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడా అనే డౌట్ ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఈ మధ్యన మణిశర్మ కి అసలు హిట్స్ అనేవే లేవు. చిన్న చితకా సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ వాటిలో ఒక్కటి కూడా మణిశర్మ అంటే ఏమిటో ప్రూవ్ చెయ్యలేకపోతున్నాయి. రీసెంట్ గా చేసిన 'అమీ తుమీ, ఫ్యాషన్ డిజైనర్' కూడా మణిశర్మకి పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. మరి అలా ఫామ్ లో లేని సంగీత దర్శకుణ్ణి 'లై' సినిమాకి తీసుకోవడం అంటే నితిన్ కాస్త రిస్క్ చేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయినా నితిన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో వున్నాడు. అలాంటప్పుడు ఇలా ఫామ్ లో లేని సంగీత దర్శకుణ్ణి ఎంపిక చేసుకుంటే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయి. అయినా నితిన్ ఏ దేవీశ్రీనో లేకపోతే తమన్ నో అదీ కాదనుకుంటే తన సెంటిమెంట్ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ నో తీసుకోవాల్సిందంటూ సలహాలు పడేస్తున్నారు.