'బాహుబలి' రెండు పార్ట్‌ల కోసం ప్రభాస్ సుమారు 5 సంవత్సరాల టైమ్‌ని కేటాయించాడు. అయితే మొదటి పార్ట్‌లో కంటే రెండో పార్ట్‌లో ప్రభాస్ స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువనే విషయం తెలిసిందే. దీనికోసం ప్రభాస్ మాత్రమే కాకుండా ప్రభాస్ లాంటి మరో వ్యక్తి కూడా చాలా కష్టపడ్డాడని తాజాగా వెలుగులోకి వచ్చింది. సేమ్ ప్రభాస్‌లానే వుండే వ్యక్తిని రాజమౌళి..బాహుబలిలోని కొన్ని సీన్స్ కోసం ఉపయోగించాడని, ముఖ్యంగా వార్ సీన్‌లలో ప్రభాస్ ప్లేస్‌లో ప్రభాస్‌లా కనిపించే ఆ వ్యక్తే ఎక్కువగా నటించాడనే విషయం కూడా రాజమౌళి ద్వారానే బయటికి వచ్చింది. ప్రభాస్ లా ఉండే ఆ వ్యక్తి మరెవరో కాదు. పై పిక్‌లో ఉన్న కిరణ్ రాజ్.
బాహుబలి సినిమాలో కాలకేయ పాత్రలో నటించిన ప్రభాకర్ ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఇప్పుడు ఇదే రూటులో కిరణ్‌రాజ్ కూడా త్వరలో డైరెక్ట్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. కిరణ్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న 'కరాళి' అనే చిత్రం ద్వారా కిరణ్‌రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాహుబలి కెమెరామెన్ సెంథిల్ చేతుల మీదుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగిందంటే..సెంథిల్ కెమెరాకి కిరణ్‌రాజ్ ఎంతగా కనెక్ట్ అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు.
మరి తెరపై ప్రభాస్ స్థానంలో కనిపించినా..తనెవరో తెలియని కిరణ్‌రాజ్.. ఈ 'కరాళి'తో డైరెక్ట్‌గా కనిపించి ఎటువంటి ఫీడ్‌బ్యాక్‌ని అందుకుంటాడో తెలియాలంటే కరాళి రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.