మన సినిమా 'బాహుబలి'తో నేషనల్ ఇంటర్నేషనల్ లెవల్‌కి ఎదిగిందని మనం డబ్బాలు కొట్టుకుంటున్నాం. కానీ అది నిజం కాదు.. అలాగని రాజమౌళి, ప్రభాస్ అభిమానులు కోపగించుకోకండి.. మన వారసులను ప్రమోట్ చేయడంలో మన సీనియర్ స్టార్స్, బాగా పేరున్న ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీలు, దిగ్గజాలు, నిర్మాతలు అందరూ ఎప్పుడో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయారు.
ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే ఎన్ని కార్పొరేట్లు బ్రాండ్స్ అక్కినేని అఖిల్‌ని పెట్టుకోవడం గుర్తుందా? చిరంజీవికి ఎప్పటికో సాధ్యం కాని బాలీవుడ్ ఎంట్రీ అతి తక్కువ సమయంలోనే రామ్ చరణ్‌కి ఎలా దక్కింది? వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే మన వారి ముందస్తు ఆలోచనల ముందు హాలీవుడ్ కూడా దిగదుడుపే. ఇక మన దేశంలో పాశ్చాత్యపోకడలను ప్రవేశపెట్టి, అనవసర హంగామా చేసి, ప్రజల మనసుల్లో నిలిచేలా చేయడం మనవారు ఎప్పుడో నేర్చుకున్నారు. అతిశక్తివంతమైన మహిళల కోసం ఓ సర్వే, అత్యంత ధనవంతులైన వారి కోసం, మరింత అందమైన ఆడవాళ్ల కోసం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ అంటూ, ఇక ఇండియాలో మోస్ట్ బెస్ట్ డ్రస్‌డ్ సెలబ్రిటీల లిస్ట్‌లు కూడా వచ్చేశాయి.
అయితే ఫలానా దాంట్లో మా వాడి పేరు ఎందుకు లేదు.. అని బాధపడే అభిమానులు బాధపడాల్సిన పనిలేదు. ఒక్కో పత్రికను ఒక్కో ఏడాది ఓక్కో పవర్‌ఫుల్ పర్సన్, మరో లిస్ట్‌లో తమ వారసుడి పేరు ఉండేలా మరో తండ్రిరత్నాలు తమ పుత్రుల గురించి చూసుకుంటాయి. ఇక తాజాగా జీక్యూ మేగజైన్ మోస్ట్ బెస్ట్ డ్రస్‌డ్ సెలబ్రిటీ లిస్ట్‌లో సౌతాఇండియా నుంచి రామ్ చరణ్ పేరును ప్రకటించింది. మరి బన్నీ, మహేష్, ప్రభాస్ వంటి వారు ఏరి అని గొడవలు చేసి బాధపడవద్దు. వచ్చే ఏడాది ఏదో ఒక సర్వేలో వారి పేర్లు కూడా ఖచ్చితంగా ఉంటాయని హామీ ఇస్తున్నాం.
ఏదో ఒక లిస్ట్‌లో పేరు లేకపోతే ఆ మేగజైన్‌ని, వారి తండ్రులను తిట్టండి కానీ హీరోలని, అందునా మన వారసత్వ పుత్రరత్నాలను తిట్టవద్దు. ఇక బన్నీ, మహేష్ వంటి వారి పేర్లు లేవేమిటా అని ఆలోచిస్తే, వారు ఇంకా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదట. 'జంజీర్'తో బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి చరణ్‌కే ఈ సారి..నో మోర్ ఆర్గ్యుమెంట్స్..!