చిరంజీవి మెగాస్టార్ అయివుండవచ్చు. తెలుగులో తిరుగేలేని హీరో, అన్ని వర్గాలను ఆకట్టుకున్న హీరో, పాటలు, ఫైట్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి తెలుగు సినీ చరిత్రను, ఒరవడిని మార్చిన హీరోగా ఆయనకు పేరుండవచ్చు. కెరీర్‌లో ఎన్నో పడరాని పాట్లు పడి ఉండవచ్చు. కానీ తన కెరీర్ మొదట్లో కూల్ అండ్ కామ్ విలన్‌గా, 'పున్నమినాగు' వంటి చిత్రంలో అద్వితీయమైన ప్రతిభ చూపిన నటునిగా, 'మంచు పల్లకి, మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయ్' వంటి చిత్రాలను చేశాడు.
ఆ తర్వాత కాలంలో కూడా తన నటనాప్రతిభ చూపించే 'స్వయంకృషి, ఆరాధన, ఆపద్బాంధవుడు, రుద్రవీణ, డాడీ' వంటి చిత్రాలు చేశారు. వీటిల్లో చిరుకు పేరైతే వచ్చింది కానీ కాసులు మాత్రం రాలేదు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాలతో పాటు కుంటివానిగా, ముసలి గెటప్‌లు కూడావేసి తనను తాను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించుకుని, తన ముసలి గెటప్‌ని కూడా ప్రేక్షకులకు అలవాటు చేయగలిగాడు. ఎన్టీఆర్, రజనీలు ఇద్దరు ఎక్కువ చిత్రాలలో యంగ్ హీరోలుగానే గాక వారి తండ్రి వంటి పాత్రల్లో ముసలిగెటప్‌లతో కూడా మెప్పించారు.
కానీ చిరు ఓల్డ్ గెటప్ వేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. 'స్నేహం కోసం' చిత్రంలో ఆయన ఓల్డ్ గెటప్‌ను ప్రేక్షకులు ఆదరించకపోవడానికి అది కూడా ఒక కారణం. ఓ ఇంటర్వ్యూలో మీరు 'స్వయంకృషి, ఆపద్బాంధవుడు' వంటి చిత్రాలు ఎక్కువగా ఎందుకు చేయలేకపోతున్నారు? అని జర్నలిస్ట్ ప్రశ్న అడిగే లోపే కలుగజేసుకుని, కోపంగా ఆ చిత్రాలలో కోట్లు నష్టం వస్తే నువ్వు ఇస్తావా? నా సినిమా ఆడకపోతే నీవు బాధ్యత తీసుకుంటావా? నా అభిమానులు నన్ను అలా చూడలేరు. నిత్యయవ్వనంగా, కుర్రహీరోయిన్లలో చేస్తేనే చూస్తారు? మొక్కే కదా అని పీకితే పీకకోస్తా.. వంటి డైలాగ్‌లే చెబుతాను అంటూ కోపగించుకున్నాడు.
దాంతోనే ఆయన కెరీర్ అయిపోయే తరుణంలో కూడా ఓ కమల్‌హాసన్‌లా, రజనీ ముసలి, పెప్పర్‌సాల్ట్‌లుక్, తెల్ల గడ్డం వంటి వాటితో చిరుని చూడలేకపోవడానికి కారణమై, నాకంటూ ఓ డజను చిత్రాలు గొప్పగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. మొదట్లో అదే బాటలో నడిచిన చరణ్ మాత్రం వాస్తవాలు, నేటి ప్రేక్షకుల అభిరుచి గమనించి 'దృవ'తో మారాడు. సుక్కుతో చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రానికి 'రంగస్థలం' 1985 అనే టైటిల్‌ను పెట్టడానికి చిరు ఎంత మాత్రం ఒప్పుకోలేదట.
పీరియాడిక్ డ్రామా, 1985లో జరిగే కథ, యాప్ట్ టైటిల్ అన్నా కూడా ఒప్పుకోకుండా కావాలంటే నా పాత చిత్రాల టైటిల్స్‌ల్లోంచి ఓ టైటిల్ వెత్తుక్కోండి. లేదా పాత చింతకాయపచ్చడి వంటి 'పల్లెటూరి మొనగాడు' భలే ఉందని పంతం పట్టినా, సుక్కు ఒప్పుకోకపోవడం, నిర్మాతలు, చరణ్ నచ్చజెప్పడంతోనే 'రంగస్థలం' 1985- అనే టైటిల్‌కు మీ ఇష్టం అన్నాడంట. మరి ఈ చిత్రం సాధించే విజయంతోనైనా చరణ్ తన తండ్రి మైండ్‌సెట్‌ను మారుస్తాడేమో చూడాలి...!