బిగ్‌బాస్ కాన్సెప్టే డిఫరెంట్. వివిధ రంగాలకు చెందిన ఓ డజను మందిని ఓ ఇంట్లోకి పంపి, తిండి, అన్నీ సౌకర్యాలు ఉండేలా చూస్తూ, టివిలు, సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌ల నుండి దినపత్రికలు కూడా అందుబాటులో ఉంచరు. ఇక లోపల ఆ విభిన్న పరిస్థితుల్లో పార్టిసిపెంట్స్‌కి పలు అంశాలను ఇస్తారు. వాటిని వారు రక్తి కట్టించాలి. ఇక ఇలాంటి షో ద్వారానే సన్నిలియోన్ కూడా బాలీవుడ్‌కి పరిచయమైంది.
ఇక ఈ కార్యక్రమం వివాదాల పుట్ట. నీళ్లలోనే సెక్స్ చేసేవారు, సల్మాన్‌ని బండ బూతులు తిట్టినవారు. ఆ తర్వాత రాఖీసావంత్ వంటి వారు కూడా దీనిలో పాల్గొనడం.. ఇవ్వన్నీ అందరికీ తెలిసినవే. మరి ఈ షోని ఎన్టీఆర్ ఎలా వివాదాలకు తావు లేకుండా హ్యాండిల్ చేస్తాడనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మన తెలుగు రియాల్టీషోలైన కొన్నింటిలో ఓంకార్ నడిపిన వాటిలో, నవదీప్ హోస్ట్ చేసిన షోలో ఎన్నో సార్లు పార్టిసిపెంట్స్ తన్నుకోవడం, గొడవ పడటం, జుట్టులు పీక్కోవడం కూడా జరిగాయి. మరి వీరిని ఎన్టీఆర్ ఎలా మేనేజ్ చేస్తాడు? అసలే బూతులు ఉన్నాయని 'జబర్దస్త్, పటాస్' వంటి వాటిపైనే మన వారు మండిపడుతున్నారు.
మరి 'బిగ్‌బాస్'తో పోలిస్తే అవి చిన్న విషయాలే. మరి స్టార్ మాటీవీ నిజంగానే పెద్ద ప్రయోగమే చేస్తోందని అనిపిస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఒప్పుకున్నంత మాత్రాన ఈ వివాదాస్పదమైన షోలో మన సెలబ్రిటీలు ఎంత వరకు పాల్గొంటారు? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే, మరోవైపు హిందీ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా చోటిచ్చారు. కానీ తెలుగులో మాత్రం కొంతకాలం సెలబ్రిటీలే పాల్గొననున్నారు. చూద్దాం.. ఆల్ ది బెస్ట్ టు జూనియర్...!