వాస్తవానికి 'బెంగాల్‌టైగర్' తర్వాత మాస్ రాజా రవితేజ నటించిన మరో చిత్రం లేదు. పవర్‌లు, బలుపులు వచ్చినా కూడా 'కిక్' తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ కూడా లేదనేది వాస్తవం. 'కిక్2'తో ఏదో చేయబోయి ఏదో అయ్యాడు. ఇక 'బెంగాల్ టైగర్' తర్వాత ఎందరో దర్శనిర్మాతలను వెయిట్ చేయించి వరల్డ్‌టూర్‌కి వెళ్లాడు. వచ్చిన తర్వాత దిల్‌రాజు బేనర్‌లో 'రాజా దిగ్రేట్', విక్రమ్ సిరికొండ అనే నూతన దర్శకునిగా 'టచ్‌చేసి చూడు' రెండింటిని ఒకేసారి పట్టాలెక్కించాడు.
'రాజా ది గ్రేట్'లో ఆయన అంధునిగా నటిస్తున్నందువల్ల ఈ చిత్రం విభిన్నంగా ఉండనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్‌రాజు నిర్మాత కాబట్టే ఆయనే అన్ని చూసుకుంటాడు. మరోవైపు విక్రమ్ సిరికొండతో మాత్రం కాస్త తన టచ్ చూపించే 'టచ్‌చేసి చూడు' చేస్తున్నాడట. మొత్తం మీద ఇటీవల వచ్చిన చిత్రాల ఫలితాలు, ఆయన మేకోవర్‌లో వచ్చిన తేడాలు గమనించిన ఈ హీరో ఇప్పుడుతాను ఒకప్పటి హీరోని కాదని, తాను కూడా సీనియర్ హీరోనని గుర్తించాడు.
దాంతో రొటీన్ మాస్ మసాలా, అలాంటి కథలు, దర్శకులను పక్కనపెట్టి తాజాగా మరో విభిన్నమైన కథకి, ఓ యువ టాలెంటెడ్ దర్శకునికి ఓకే చెప్పాడని సమాచారం. 'స్వామిరారా'అనే సబ్జెక్ట్‌తో నిఖిల్‌ని హీరోగా నిలబెట్టి, నాగ చైతన్యతో రొటీన్ 'దోచెయ్' చేసి దెబ్బ తిన్న సుధీర్ వర్మే ఆ దర్శకుడు. ఇతనిపై మన రవితేజకు 'మంచి' అభిప్రాయం ఉండటం, ఇటీవల మరలా నిఖిల్‌తోనే 'కేశవ' చేసి జస్ట్ ఓకే అనిపించుకున్న సుదీర్ వర్మ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి మాస్ మహారాజా ఓకే చేశాడు. 'రాజా ది గ్రేట్' కంటే 'టచ్ చేసి చూడు' ముందుగా విడుదలకానుంది. అది విడుదలైన వెంటనే సుధీర్ వర్మ సినిమాని పట్టాలెక్కించి, మరలా ఎప్పుడు తన చిత్రాలు రెండు షూటింగ్‌లో ఉండేలా ఈ సీనియర్ హీరో నిర్ణయించుకున్నాడు.