'బాహుబలి-ది బిగినింగ్' మేనియాలో విజయ్, శ్రీదేవి నటించిన 'పులి' చేరితే 'బాహుబలి-ది కన్‌క్లూజన్'వలలో 'సంఘమిత్ర' పడింది.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ బడ్జెట్, సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందనుందని దర్శకుడు సుందర్ సి కూడా అధికారికంగా చెప్పేయడంతో ఇప్పుడు ఈ చిత్రం విషయంలో జోకులు పేలుతున్నాయి.
ఇక 'సంఘమిత్ర' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని తయారు చేసి ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఆర్భాటం చేశారు. అందులో కీలకంగా మారిన శృతి హాసన్‌పై ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయింది. ఈ చిత్రం కోసం పాపం శృతి.. కత్తిసాములు, యుద్ద విద్యలు నేర్చుకుంది. లండన్‌లో ఎంతో కష్టపడింది. కానీ చివర్లో మాత్రం తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, ఈ చిత్రం స్క్రిప్ట్, కథ రెడీగా లేవని చెప్పి కోపంతో చెక్కేసింది. ఇక ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను తయారు చేసేటప్పుడే తాను నేర్చుకున్న కత్తి విద్యలు, గుర్రపు స్వారీలతో శృతి చేత యూనిట్ ఏకంగా ఓ ఫొటో షూట్ నిర్వహించిందట.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అందునా కేన్స్‌లో ఆమె ఆ పోస్టర్‌లో తానే కనిపిస్తానని భావించినప్పటికీ దర్శకనిర్మాతలు వద్దనుకొని, ఒక పెయింటింగ్‌ను గీయించి, పోస్టర్‌లో పెట్టారు. అదే అసలు శృతి కోపానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో శృతిని వదిలేసి హన్సిక, తమన్నా, అనుష్క వంటి వారిని అనుకున్నారు. కొన్ని ఇబ్బందుల వల్ల జేజమ్మ నో అంది. తమన్నా, హన్సికలకు టాలీవుడ్‌లో కోలీవుడ్‌లో మార్కెట్ లేదు. చివరకు ఈ యూనిట్ ఎంతో కష్టపడి నయనతారను ఓకే చేయించిందని లేటెస్ట్‌టాక్. నయన స్వభావం తెలిసిన దర్శకనిర్మాతలు కాబట్టే ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నామని, కాబట్టి అన్ని చిత్రాలలాగా కాకుండా తమ చిత్రానికి ప్రమోషన్ వదలకుండా చేయాలని, దానికి ముందుగానే ఎంత కావాలో చెప్పాలని అడగటం, నయన చెప్పిన ఫిగర్‌కు దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు.
రెండేళ్ల పాటు కాల్షీట్స్ ఇవ్వడంతో పాటు చంచల మనస్తత్వం లేని స్ధిరమైన నిర్ణయం తీసుకునే హీరోయిన్ కావాలనే లోటు నిర్మాతలకు తీరింది. ఇక హీరోలతో సరిసమానమైన స్టార్ డమ్ ఆమెకు కోలీవుడ్‌లో ఉంది. ఇటీవల వచ్చిన కొన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా ఒంటి చేత్తో లాకొచ్చింది. కానీ అలా ఆమె లీడ్ రోల్ చేసిన 'అనామిక' పరిస్థితి తెలుగులో తెలిసిందే. ఇక బాలీవుడ్‌లో పరిస్థితి అందరికీ తెలిసిందే. కంగనా రౌనత్‌కే సీన్ లేదు. దాంతో 'సంఘమిత్ర'ను ఎంత భారీ బడ్జెట్‌తో తీసినా ఈ చిత్రం పరిధి, క్రేజ్ కేవలం కోలీవుడ్ వరకే పరిమితమని కొందరు తేల్చేస్తున్నారు.