ఉత్తరాది మీడియాకు, మరీ ముఖ్యంగా నేషనల్ మీడియాగా ముంబై, ఢిల్లీలో తిష్టవేసుకుని కూర్చొనే మీడియా దక్షిణ భారతంపై ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉంటుంది. రాజకీయంగా పి.వి.నరసింహారావు, దేవెగౌడ వంటి వ్యక్తుల నుంచి దక్షిణాది ఆటగాళ్లపై, రాష్ట్రపతులపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుతుంటుంది. ఇక 'బాహుబలి' తర్వాత బాలీవుడ్ మీడియా దక్షిణాది అంటే మండిపడుతోంది.
ఖాన్‌త్రయానికి కూడా చేతకాని, వీలు కాని రికార్డులను సాధించిన 'బాహుబలి'టీంపై విషపుప్రచారం చేస్తోంది. ఇక తాజాగా ఈ మీడియా ఉత్తరాది వారు బాహుబలిగా పిలుచుకుంటున్న యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్‌పై తన ఫోకస్ పెట్టింది. 'బాహుబలి' విజయాన్ని ప్రభాస్ తలకు ఎక్కించుకున్నాడని, దాంతో ఇటీవల తనతో సినిమాలు తీయాలని భావించిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలను ప్రభాస్ ఏకంగా 80కోట్లు రెమ్యూనరేషన్‌గా అడిగాడని వార్తలు రాస్తోంది. వాస్తవానికి తెలుగులో లేదు కానీ.. బాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో అయినా నామమాత్రపు రెమ్యూనరేషన్ తీసుకుని, ప్రాఫిట్ షేరింగ్ విధానం అవలంబిస్తారు.
ఇది నిర్మాతలకు కూడా మంచిదే. ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే కోలీవుడ్,టాలీవుడ్‌లకు విస్తరిస్తోంది. ఇక నామమాత్రపు పారితోషికంతో పాటు సినిమా హిట్టయితే సల్మాన్ ఖాన్ ఉన్న రేంజ్‌కి 60కోట్లు వస్తాయి. అమీర్ ఖాన్‌కు 50కోట్లు, షారుఖ్ ఖాన్‌కి 40 నుంచి 50కోట్లు మిగులుతాయి. వారి ఎవరు హీరో అయినా ఇదే పద్దతిని ఫాలో అవుతారు. అటువంటప్పుడు లాభాలలో వాటా అడిగాల్సిన ప్రభాస్ ఏకంగా 80కోట్లు డిమాండ్ చేశాడని వార్తలు రాయడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం.
ఇక కొన్ని వెబ్‌సైట్స్‌తో పాటు ఫిల్మ్‌జర్నస్ కూడా ప్రభాస్ 'బాహుబలి-ది బిగినింగ్'కి 20కోట్లు, 'బాహుబలి-ది కన్‌క్లూజన్'కు 25కోట్లు తీసుకున్నాడని, కేవలం పారితోషికం తప్ప ప్రభాస్ లాభాలలో వాటా తీసుకోలేదు కాబట్టి హిందీ నిర్మాతలను కూడా 20 నుంచి 25కోట్లే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? అసలు ఓ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకోవాలని అని నిర్ణయించడానికి మీడియాకు ఏం పని? అది నిర్మాతలు చూసుకునే విషయం.
మరి ఇంత తెలివితక్కువగా బాలీవుడ్ మీడియా ప్రభాస్‌పై చేస్తున్న దుష్ప్రచారం సమంజసంగా లేదు. ఇక మరోవెబ్‌సైట్ అయితే మరింత ముందుకెళ్లి '2.0'లో కేవలం సౌత్‌ఇండియన్ స్టార్ అయిన రజనీకాంత్ కంటే బాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన అక్షయ్‌కుమార్‌కు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ కథలు వండివార్చింది. వాస్తవానికి ప్రభాస్ మనస్తత్వం ఏమిటి? ఆయన బిహేవియర్ ఏమిటి? వంటి వన్నీ తెలుగు ఇండస్ట్రీకే కాదు.. ప్రేక్షకులకు కూడా తెలుసు. మరి ఈ విషయంలో ఓవర్‌యాక్షన్ చేయడం ద్వారా బాలీవుడ్ మీడయానే నవ్వులపాలవుతోందని చెప్పవచ్చు.
ఇక ప్రభాస్ నటించే 'సాహో' బడ్జెట్ కేవలం తక్కువేనని, కానీ 150కోట్లు చెబుతున్నారని, అందులో ప్రభాస్ రెమ్యూనరేషనే 80కోట్లు ఉందని రాస్తోంది. అసలు యువిక్రియేషన్స్ బేనర్ అనఫిషియల్‌గా ప్రమోద్, వంశీలదే కాదు.. అందులో ప్రభాస్ కూడా భాగస్వాముడేనని ఆ జీనియస్‌లకు అర్ధం కావడం లేదు. 'సాహో' తర్వాత ప్రభాస్ మరే హిందీ నిర్మాతలకు అవకాశం ఇవ్వకుండా కరణ్ జోహార్ ధర్మప్రొడక్షన్స్‌లోనే రాజమౌళి దర్శకత్వంలో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. మరి అవి నిజమో కాదో తెలియాల్సివుంది.