Advertisementt

అడ్డంగా బుక్కైపోయిన యాంకర్‌ రష్మి...!

Wed 14th Jun 2017 02:56 PM
anchor rashmi,jabardasth comedy show,vizag,shop opening  అడ్డంగా బుక్కైపోయిన యాంకర్‌ రష్మి...!
Anchor Rashmi Vizag Went to A Shop Opening అడ్డంగా బుక్కైపోయిన యాంకర్‌ రష్మి...!
Advertisement
Ads by CJ

కాస్త సెలబ్రిటీ హోదా వచ్చినవారు ఏది మాట్లాడినా సంచలనమో, వివాదమో అవుతుండటం సహజం దానికి మీడియా అటెన్షన్‌, ప్రజలలో వారికుండే క్రేజ్‌, ఇమేజ్‌ వంటివి కూడా ఇలాంటి వార్తలు త్వరగా ప్రచారం కావడానికి దోహదం చేస్తాయి. ఈ విషయంలో సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటా, నడక, నడత వంటివి చాలా ప్రాముఖ్యం వహిస్తాయి. ఇక ఈటీవీలో 'జబర్దస్థ్‌' (ఎక్స్‌ట్రా) యాంకర్‌గా ఫేమస్‌ అయిన రష్మి.. ఇటీవల బుల్లి తెర నుండి వెండితెరపై కూడా క్రేజ్‌ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. 

తన మాటల ద్వారా, తన చేష్టల ద్వారా తాను నిరంతరం వార్తల్లో ఉండేలా చేసుకుంటోంది. ఇక ఆమె నటించిన 'గుంటూరు టాకీస్‌'లో ఆమె శృంగార సన్నివేశాలు సినిమాను నిలబెట్టి, నిర్మాతలకు లాభాలు రావడానికి ఎంతగానో దోహదం చేశాయి. కాగా ఇటీవల రష్మి వైజాగ్‌ దగ్గర ఓ షాప్‌ ఓపెనింగ్‌కు వెళ్లింది. వెళ్లింది సరే.. మౌనంగా ఉండకుండా తనకు వైజాగ్‌ అంటే ఇష్టమని, త్వరలో వైజాగ్‌లోనే స్థిరపడుతానని ఓ స్టేట్‌మెంట్‌ను ఇచ్చేసింది. ఇకేముంది...! రష్మి ఓ వైజాగ్‌ యువకుడిని ప్రేమిస్తోందని, డేటింగ్‌ కూడా చేస్తోందని, త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకుని వైజాగ్‌లో స్ధిరపడతారని వార్తలు గుప్పుమన్నాయి. 

ఇక తాను ఆ ఉద్దేశ్యంతో వైజాగ్‌లో స్ధిరపడతానని అనలేదని, తాను వైజాగ్‌లో స్దిరపడతాను అంటే తాను వైజాగ్‌ కుర్రాడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని కాదుగా.. అంటూ ఆపసోపాలు పడుతోంది. కానీ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ రూమర్‌ వ్యాపించినంత వేగంగా ఆమె ఇచ్చిన క్లారిటీ మాత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. మొత్తం మీద బుల్లితెరపై పలు అవకాశాలతో పాటు రేష్మి ప్రస్తుతం గీతాఆర్ట్స్‌, యువిక్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా కీలకమైన పాత్రను చేస్తోంది. 

Anchor Rashmi Vizag Went to A Shop Opening:

Some kind of celebrity, whether it's talking or sensational, is a media attention to the culture, such as the craze for the people, and the likes of the people to help promote such news quickly. Rashmi, who is famously known as 'Jabardasth' (Extra) in anchor, has recently been struggling to get a curtain on the silver screen.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ