Advertisementt

ప్రభాస్, సల్మాన్ లని భరించగలరా..?

Tue 13th Jun 2017 07:40 PM
  ప్రభాస్, సల్మాన్ లని భరించగలరా..?
Prabhas and Salman Khan Multi Star Film ప్రభాస్, సల్మాన్ లని భరించగలరా..?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు జాతీయ స్థాయిలో పేరొచ్చేసింది. ఈ దెబ్బకి ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తాడనుకున్నారంతా... ఆ మేరకు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ పై రకరకాల కథనాలు కూడా ప్రచారమయ్యాయి. బాలీవుడ్ లో కరణ్ జోహార్, ప్రభాస్ ని బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడని.... ఒకటేమిటి చాలానే ప్రచారం జరిగాయి. కానీ ప్రభాస్ బాలీవుడ్ కి వెళ్లడంపై ఇప్పుడు ఎటువంటి వార్తలు రావడంలేదు. కారణం ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సాహో చిత్రం. సాహూ చిత్రాన్ని సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ వారికి చేస్తున్న ప్రభాస్ ఇప్పట్లో బాలీవుడ్ కి వెళ్లే పరిస్థితులు లేవు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ బాహుబలి...  ప్రభాస్, బాలీవుడ్ భజరంగి భాయిజాన్... సల్మాన్ ఖాన్ కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి డైరెక్షన్ లో వీరిద్దరూ ఒక సినిమా చేయబోతున్నట్టు చెబుతున్నారు. మాస్ మసాలాలను,  కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఒక కథ తయారుచేసినట్లు చెబుతున్నారు. మరి ఒకవేళ కథ ఒకే అయ్యి ఈ ఇద్దరు బడా స్టార్స్ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ సినిమా సెట్స్ మీదకెళ్లాలంటే బడ్జెట్ సమస్య ఉంటుందేమో అంటున్నారు.

ఎందుకంటే బాహుబలితో రికార్డులు సృష్టించిన ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ల పారితోషకాలే సినిమా బడ్జెట్ లో సగం పెట్టాల్సి వస్తుంది. మరి ఇవన్నీ ఆలోచించిన నిర్మాత ఎవరైనా ఈ సినిమాని తెరకెక్కిస్తే గనక ఈ ప్రాజెక్ట్ కి ఇండియాలో అత్యంత క్రేజ్ రావడం ఖాయం. అయినా ఇదంతా ఇప్పట్లో జరిగే పనికాదు. ఎందుకంటే సల్మాన్ తన సినిమాలతో బిజీగా ఉండగా...ప్రభాస్ సాహోతో బిజీగా వున్నాడు.

Prabhas and Salman Khan Multi Star Film:

There have been reports on Karan Johar wants to launch Prabhas in Mumbai filmy duniya with a big project and now Rohit Shetty’s name added into the list, a clear show of how North film makers are craving to cash on Prabhas stardom.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ