Advertisementt

నాని ఓకే చెప్పాడు..ఇంక హ్యాట్రిక్కే..!

Tue 13th Jun 2017 05:57 PM
nani,merlapaka gandhi,hattrick,nani news movie,merlapaka gandhi movies  నాని ఓకే చెప్పాడు..ఇంక హ్యాట్రిక్కే..!
Merlapaka Gandhi Waiting for Hero Nani నాని ఓకే చెప్పాడు..ఇంక హ్యాట్రిక్కే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో తీసిన రెండు సినిమాలతోనే సూపర్ హిట్స్ కొట్టిన మేర్లపాక గాంధీ గుర్తున్నాడా..? 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా' వంటి సినిమాల హిట్స్ ని ఖాతాలో వేసుకున్న మేర్లపాక  గాంధీ మూడో సినిమాని కూడా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందుకే ఈసారి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోని లైన్లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నాడు. మరి హ్యాట్రిక్ హిట్ అందుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా.. ఇక వరుస విజయాలతో దూసుకుపోనున్న నాని తో సినిమా చేస్తే హ్యాట్రిక్ కొట్టేస్తానని భావించి గాంధీ ఇప్పుడు నాని వెంటపడుతున్నాడట. 

ఇప్పటికే నాని కి ఒక స్టోరీ వినిపించాడని.... ఆ స్టోరీ లైన్ నానికి కూడా నచ్చిందని టాక్ వినబడుతుంది. 'నిన్నుకోరి' సినిమాతో బిజీగా ఉన్న నాని.... దిల్ రాజు నిర్మాతగా మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు. మరి దిల్ రాజు సినిమా కంప్లీట్ అయ్యాకే.. నాని, గాంధీ సినిమాలో నటిస్తాడు. ఇక నానికి స్టోరీ కూడా నచ్చడంతో గాంధీ కూడా నిర్మాత, హీరోయిన్ సెట్ చేసే పనిలో పడ్డాడట. అయితే నానికి నిజంగా కథ ఒకే అయితే గనక  నానితో సినిమాలు చెయ్యడానికి ఇద్దరు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అందులో ఎవరినో ఒకరిని గాంధీ సినిమాకు నిర్మాతగా చేస్తారన్నమాట. మరి ఎవరు రెడీగా వున్నా నాని, దిల్ రాజు ల నిర్మాణంలో తెరకెక్కే 'ఎంసీఎ' పూర్తయితేనే గాని గాంధీ సినిమాకి ఫ్రీ అవ్వడన్నమాట.

Merlapaka Gandhi Waiting for Hero Nani:

Merlapaka Gandhi Directs Nani. This Movie Hit-tirck Film to Him.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ