ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Brahmanandam has assets over Rs 320 crore

బ్రహ్మీ ఆస్తుల విలువెంతో తెలుసా...?

Brahmanandam has assets over Rs 320 crore

బ్రహ్మనందం కమెడియన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పటినుండి నిన్నమొన్నటి వరకు వెనుదిరిగి చూసుకోకుండా రెండు చేతులా సంపాదిస్తూనే వున్నాడు. అయితే ఈ మధ్యన బ్రహ్మి కి అనూహ్యంగా ఆఫర్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు రోజువారీ రెమ్యునరేషన్ అందుకున్న బ్రహ్మి కి ఇప్పుడసలు ఆఫర్లులేక వెలవెలబోతున్నాడు. అసలు టాలీవుడ్ లో కొందరు దర్శకులు బ్రహ్మానందంకి ప్రత్యేకంగా కేరెక్టర్స్ ని సృష్టించేవారు. అందుకే కొన్నిసార్లు బ్రహ్మి వల్లనే సినిమాలు హిట్టయ్యేవి. అంతలా కామెడీని పండించేవాడు. అయితే టాలీవుడ్ లో బ్రహ్మి తర్వాత ఆ రేంజ్లో కామెడీని ఎవరూ చెయ్యలేకపోయారనేది మాత్రం జగమెరిగిన సత్యం.

అయితే బ్రహ్మానందం సినిమాల్లో చేస్తున్నప్పుడే బోలెడు డబ్బుని వెనకేసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడని అంటున్నారు. ఆయన చాలా డబ్బు, స్థిర చరాస్తులు సంపాదించాడని అంటున్నారు. ఒక ఆంగ్ల మీడియా బ్రహ్మనందం ఆస్తులపై చర్చకు తెరలేపింది. మరి ఆ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం బ్రహ్మి ఆస్తుల విలువ 320 కోట్ల రూపాయల పైమాటే అని చెబుతుంది. జూబ్లీ హిల్స్ లో బ్రహ్మానందానికి పెద్ద ఇల్లు ఒకటి, అలాగే ఫార్మ్ హౌస్ విలువతో కలుపుకుంటే ఆయన ఆస్తులు విలువ మూడొందల కోట్ల రూపాయల పైమాటే అని ఆ సంస్థ చెబుతోంది.

అలాగే బ్రహ్మి దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని... ఆడీ ఆర్8, ఆడీ క్యూ7, మెర్సిడేజ్ బెంజ్ బ్లాక్  కార్లు  బ్రహ్మికి ఉన్నాయని ఆపత్రిక రాసింది. మరి ఈ డబ్బంతా కేవలం బ్రహ్మానందం సినిమాల్లోనే కష్టపడి సంపాదించాడని... కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బ్రహ్మానందం ఇంతటి డబ్బుని మూటగట్టాడని అంటున్నారు. ఎంతైనా 320 కోట్లు అంటే మాటలు కాదు కదండీ..!

Brahmanandam is the now the most-sought after comedian and he might also be the highest paid comedy actor in the industry. And his current overall financial assets are pegged at Rs 320 crore, said a news report.

brahmanandam
assets
320 crores
comedian
comedian brahmanandam assets