టాలీవుడ్‌లో సీనియర్ కమెడియన్లయిన బ్రహ్మానందం, అలీ, బాబూమోహన్ వంటి వారి హవా లేదు. నుంచి బట్టల సత్యం (మల్లికార్జునరావు). ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతిప్రసాద్‌లతో పాటు కొందరు మరఱించగా, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీశ్రీరాం, సుత్తివేలు, రాళ్లపల్లి వంటి వారి వయసు అయిపోయింది. ఇక కృష్ణభగవాన్‌ని ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. వేణుమాధన్, సుమన్‌శెట్టి వారు కనుమరుగైయారు. సునీల్, సప్తగిరి వంటి వారు హీరోలైపోయి.. కమెడియన్ పాత్రలను తగ్గించారు. దాంతో ఇప్పుడు అంతటా వెన్నెలకిషోర్ పేరు వినిపిస్తోంది. మరోవైపు 'జబర్దస్త్'టీంలోని పలువురు రాజ్యమేలుతున్నారు.
కానీ వీరి కామెడీ రొటీన్ అనిపిస్తోంది. ఈ టైమ్‌లో 'పెళ్లిచూపులు' ద్వారా తెలుగు ప్రేక్షకులను తనదైన టైమింగ్, పంచ్‌లతో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరితో ప్రియదర్శి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు కూడా రావడంతో ఇందులోని నటీనటులకు అందరికీ మంచి అవకాశాలొస్తున్నాయి. కాగా ప్రస్తుతం ప్రియదర్శి విజయ్ దేవరకొండనే నటించిన 'అర్జున్‌రెడ్డి'లో ప్రధాన హాస్యనటునిగా కనిపించనున్నాడు.
మరోవైపు మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'స్పైడర్'లో ప్రియదర్శి మెయిన్ కమెడియన్ రోల్‌ను పోషిస్తున్నాడు. తాజాగా ఈ యువ కమెడియన్‌కి మరో ద్విభాషా చిత్రంలో మంచి కామెడీకి స్కోప్ ఉన్న పాత్ర వచ్చింది. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న హర్రర్ మూవీ 'కారు'లో ఇతను కమెడియన్ పాత్రను పోషిస్తున్నాడు.
నేటిట్రెండ్‌ను బట్టి హర్రర్ కామెడీ చిత్రాల హవా ప్రస్తుతం నడుస్తోంది. వాటిల్లో కామెడీకి కూడా మంచి స్కోప్ ఉంటోంది. మరి ఈ వరుస అవకాశాలను ప్రియదర్శి నిలుపుకుంటాడో, లేక తాను కూడా అదే బాపత్తు అన్నట్లుగా తట్టాబుట్టా సర్దుకుంటాడో వేచిచూడాల్సివుంది...!