Advertisementt

'డిజె' దాకా ఆగాల్సిందేనా..?

Tue 13th Jun 2017 01:49 PM
dj movie,hrish shankar,allu arjun,dil raju,kaadhali movie,ktr,ram charan  'డిజె' దాకా ఆగాల్సిందేనా..?
Dj Movie and Kaadhali Movie's Comparison 'డిజె' దాకా ఆగాల్సిందేనా..?
Advertisement
Ads by CJ

'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం ఓవర్‌ ఫ్లోతోనైనా గట్టెక్కుదామని భావించిన అడల్ట్‌ మూవీ 'బాబు బాగా బిజీ' చిత్రం బిజీ చేయకుండానే నిశ్శబ్దంగా బాక్సులు వెనక్కివచ్చేయి. ఆ తర్వాత విభిన్న చిత్రాలు చేసే హీరోగా పేరుతెచ్చుకున్న నిఖిల్‌ 'కేశవ' చిత్రం విడుదలైంది. నిఖిల్‌కి హీరోగా 'స్వామి రా..రా'వంటి పెద్ద విజయాన్ని అందించిన కాంబినేషన్‌ కావడంతో ఈ చిత్రంపై పలువురు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

కానీ ఈ చిత్రం ఫర్వాలేదనిపించినా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'వెంకటాపురం', పెద్ద వంశీ 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాన్‌ లేడీస్‌ టైలర్‌', 'అమీతుమీ' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయాయి. ఇక నాగార్జున సొంతబేనర్‌ 'అన్నపూర్ణ స్టూడియోస్‌'లో నాగార్జునకు తన మొదటి చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌బస్బర్‌ని అందించిన కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య-రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు నటించిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బాక్సాఫీస్‌ వద్ద చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా దూసుకుళ్తూ తన సత్తా చాటుతోంది. 

ఇక ఈ చిత్రం యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మహిళా భిమానుల అభిమానంతో వేసవి సీజన్‌కి భారీ వీడ్కోలు ఇచ్చింది. ఈ వారం కాకుండా వచ్చే వారం అల్లు అర్జున్‌-దిల్‌రాజు- హరీష్‌ శంకర్‌-దేవి శ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య 'డిజె' (దువ్వాడజగన్నాథం) చిత్రం భారీ ఎత్తున రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తే అసలే వరుస విజయాలలో 'సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు' లను మించి అతి పెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలున్నాయి. కాంబినేషన్‌పై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండటం, ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌లతో పాటు సాంగ్స్‌ కూడా అదరగొడుతుండటం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. 

అంటే 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' తర్వాత విడుదల కానున్న హైఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న మూవీ ఇదే కావడగ గమనార్హం. ఇంకా పిల్లలు స్కూళ్లతో బిజీ కాకపోవడంతో సమ్మర్‌ సీజన్‌కి ఇది కొనసాగింపుగా భావించాల్సివుంది. దీంతో 'డిజె'కి మరో వారం మాత్రమే గ్యాప్‌ ఉండటంతో ఈ శుక్రవారం థియేటర్ల వద్ద పెద్ద సందడి కనిపించే అవకాశాలు లేవు. ఈ వారం కేవలం తెలంగాణ ఐటీ మంత్రి, కేసీఆర్‌ తనయుడి మిత్రుడు పట్టాభి తెరకెక్కించిన 'కాదల్‌', ఆది పినిశెట్టి నటించిన తమిళ చిత్రంకి డబ్బింగ్‌గా 'మరకతమణి' మాత్రం రిలీజ్‌ అవుతున్నాయి. వీటిల్లో కేటీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు ఆడియో ఆవిష్కరించిన 'కాదల్‌' మీద మాత్రమే కాస్త ఫోకస్‌ ఉందని చెప్పాలి. 

Dj Movie and Kaadhali Movie's Comparison:

There is no possibility that there will be a big hatchback on theaters this Friday, as there is only one week of 'DJ'. This week only Telangana IT minister, KTR is releasing his 'friend' and 'Kaadhali', which is releasing the movie 'Marakathamani' for the Tamil film starring Adi Pinisetty.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ