నాడు డాక్టర్ రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై 100కు పైగా చిత్రాలను నిర్మించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. ఆయనతో పాటు మరికొందరు అదీ మోహన్ బాబు వంటి వారు మాత్రమే నిర్మాతలుగా 50 చిత్రాలు నిర్మించారు. కానీ ఈ రోజుల్లో అది ఎవ్వరికీ వీలయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న యువ నిర్మాతల్లో దిల్‌రాజు బేనర్ అయిన 'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్' మాత్రమే ఇప్పటి వరకు 25 చిత్రాలు నిర్మించింది. ఇక దిల్‌రాజు మొదటి చిత్రం 'దిల్'. అల్లు అర్జున్ మొదటి చిత్రం 'గంగోత్రి'.ఇక దిల్ రాజు- బన్నీ ఇద్దరికీ 'ఆర్య' అనేది రెండో చిత్రం. ఇక దిల్‌రాజు ఆరో చిత్రం 'పరుగు'. బన్నీకి కూడా అది ఆరో చిత్రమే.
కాగా తన 25వ చిత్రాన్ని ఎవరి కాంబినేషన్‌లో చేయాలా? అని ఆలోచించేటప్పుడు దిల్‌రాజు కుమార్తె హన్షిత బన్నీతో చేద్దామని పట్టుబట్టి దిల్‌రాజును ఒప్పించిందట. ఇక 25వ చిత్రం మంచి కాంబినేషన్‌లో ఉండాలని పట్టుబట్టడంతో హరీష్ శంకర్-దేవిశ్రీప్రసాద్‌లు కలిశారు. ఈ చిత్రానికి ముందు బన్నీతో దిల్‌రాజుకి 9ఏళ్ల గ్యాప్ వచ్చింది. అయితే గత నాలుగేళ్లుగా దిల్‌రాజు బన్నీ కోసం మంచి కథ కోసం అన్వేషిస్తున్నాడట. అది చిట్టచివరికి తన 25వ చిత్రంగా 'డిజె'గా రూపుదిద్దుకుందని దిల్‌రాజు ఎంతో ఆనందంతో చెబుతున్నాడు. మరి ఈ చిత్రం దిల్‌రాజు, బన్నీల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడవ చిత్రం కాగా, దర్శకునిగా హరీష్ శంకర్ దిల్‌రాజు బేనర్‌లో చేస్తున్న మూడో చిత్రం కూడా 'డిజె' కావడం మరింత విశేషం.