Advertisementt

బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా... పేరొచ్చింది..!

Mon 12th Jun 2017 03:57 PM
raabta movie,kriti sanon,sushant singh rajput,magadheera remake  బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా... పేరొచ్చింది..!
Kriti Sanon Playing Two Different Roles in Raabta Movie బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా... పేరొచ్చింది..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు పక్కన '1  నేనొక్కడినే'లో హీరోయిన్ గా నటించిన  కృతి సనన్.... ఇప్పుడు బాలీవుడ్ లో కాస్త బిజీ అయ్యింది.  ‘హిరోపంతి’ ఫిలింతో  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత షారుక్ 'దిల్ వాలే' సినిమాలో కూడా మంచి నటనను ప్రదర్శించిన కృతి సనన్ తాజా చిత్రం 'రాబ్తా' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. 'మగధీర'కు ఫ్రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అనేక సమస్యలను ఎదుర్కొని గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యలేక చతికిల పడింది.

'మగధీర' నిర్మాతలు 'రాబ్తా' నిర్మాతలపై కోర్టుకు వెళ్లారు. తమ చిత్రాన్ని కాపీ చేసి 'రాబ్తా' చిత్రాన్ని తెరకెక్కించారని.... కానీ ఏమైందో ఏమో మధ్యలో కేసు వాపసూతీసుకున్న 'మగధీర' నిర్మాతలు కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి . ఇక ఈ సమస్యతో 'రాబ్తా' చిత్రానికి బాగా పబ్లిసిటీ దొరికింది. కావాల్సిన దానికన్నా ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది 'రాబ్తా' చిత్రం మీద. కానీ 'రాబ్తా' విడుదలైన తర్వాత ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.  సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ ఇందులో నటించిన కృతి సనన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. 

'రాబ్తా' లో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించిన కృతి సనన్ ఒక పాత్రలో బుడాపెస్ట్ సిటీలో చాక్లెట్ తయారీ బిజినెస్ చేసే యంగ్ గర్ల్ గా, గ్లామరస్ గా కనబడి అందరిని ఆకట్టుకుంది. మరోపాత్రలో వీరనారిగా మెప్పించింది. అలాగే సుశాంత్ సింగ్ తో రొమాంటిక్ గా రెచ్చిపోయిన కృతి కి 'రాబ్తా' ప్లాపైనా కూడా ఈ సినిమా అమ్మడికి మంచి పేరే తెచ్చిపెట్టింది.

Kriti Sanon Playing Two Different Roles in Raabta Movie:

Mahesh Babu's film '1 Nenokkadine' is the heroine of Kriti sanon. Now it is a bit busy in Bollywood. Kriti Sanon's latest movie 'Raabta' is box office It was overturned. Kriti sanon, who appeared in two different roles in 'Raabta', became a glamorous, chocolate maker business in Budapest City in a role.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ