Advertisementt

ఎన్టీఆర్ బయో పిక్ త్వరలోనే ఉంటుందట..!

Mon 12th Jun 2017 03:28 PM
nandamuri balakrishna,puri jagannadh,paisa vasool movie,senior ntr biopic  ఎన్టీఆర్ బయో పిక్ త్వరలోనే ఉంటుందట..!
Balayyya Opens up on NTR's Biopic Again ఎన్టీఆర్ బయో పిక్ త్వరలోనే ఉంటుందట..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కిస్తానని బాలకృష్ణ ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు ఆ బయో పిక్ కి సంబందించిన విశేషాలేమి మీడియాకి చెప్పలేదు. అయితే బాలయ్య ఇప్పుడు పోర్చుగల్ లో 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఇక పోర్చుగల్ లో షూటింగ్ ముగించుకుని త్వరలోనే హైదరాబాద్ కి రానుంది చిత్ర యూనిట్. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత బాలయ్య బాబు ఎన్టీఆర్ బయో పిక్ కి సంబందించిన పనుల్లో బిజీ అవుతానని అంటున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు సినీ ప్రముఖుల్నిమరియు తమ కుటుంభం సభ్యులను కలిసి తన తండ్రికి సంబందించిన విషయాలపై కూలంకషంగా చేర్చించిన తర్వాతే ఈ చిత్రానికి సంబందించిన దర్శకుడిని బాలయ్య ఫైనల్ చేస్తానని చెబుతున్నాడు. 

ఇక తండ్రి బయో పిక్ ని తెరకెక్కించి ఆయన రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నాని అంటున్నాడు బాలయ్య. మరి ఎన్టీఆర్ బయో పిక్ లో నిజాలని తెరమీద చూపిస్తారా? లేకుంటే తమకు అనుకూలమైన విషయాలెనే చూపిస్తారా అనే దాని మీద మాత్రం బయట రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ బాలకృష్ణ ఫ్యామిలీ మాత్రం అస్సలు స్పందించడంలేదు. ఇకముందు కొత్త బాలయ్యని చూడబోతున్నారని...స్వయానా బాలకృష్ణే చెబుతున్నాడు.  జానపదంలో ఫ్యాంటసీ ఉండేలా ఓ కథ రెడీ అవుతోందని..... ఒక పౌరాణిక సినిమా కూడా చేయబోతున్నానాని..... వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని అంటున్నాడు బాలయ్య.

Balayyya Opens up on NTR's Biopic Again:

Balakrishna in his recent interview reiterated that the project is very much on and he would consult cine analyst Kommineni Venkateswara Rao, his fans, well wishers and the members of his family. Now that Balayya informed he would discuss on the project with his family members, he is hoped to consult Lakshmi Parvathi and Daggubati to deal the political life of his father quite well in the biopic.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ