Advertisementt

ప్రభాస్ కి ఈ ముగ్గురిలో ఫైనల్ ఎవరవుతారో..?

Mon 12th Jun 2017 01:26 PM
saaho movie,director sujith,prabhas,anushka,pooja hegde,manjima mohan,uv creations  ప్రభాస్ కి ఈ ముగ్గురిలో ఫైనల్ ఎవరవుతారో..?
Prabhas 'Saaho' Movie Heroines Update! ప్రభాస్ కి ఈ ముగ్గురిలో ఫైనల్ ఎవరవుతారో..?
Advertisement
Ads by CJ

ప్రభాస్ 'సాహో' చిత్రం సైలెంట్ గా స్టార్ట్ అయిపోయి షూటింగ్ జరిపేసుకుంటుంది. మరి షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్  మాత్రం ఇప్పటి వరకు ఫైనల్ అవలేదు. నిన్నటి వరకు బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినబడినప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ పక్కన అనుష్క, పూజ హెగ్డే, మంజిమ మోహన్ ల పేర్లు బలంగా వినబడుతున్నాయి. రోజుకో పేరు తెరమీదకొస్తున్న ఈ సినిమాలో ఫైనల్ గా ఏ హీరోయిన్ ని సెట్ చేస్తారో గాని ప్రేక్షకులకి మాత్రం రోజు రోజుకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. బాహుబలితో సూపర్ హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న అనుష్క, ప్రభాస్ లు మళ్లీ 'సాహో' లో కూడా నటిస్తే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని డైరెక్టర్ సుజిత్, నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వారు భావిస్తున్నారట.

మరో వైపు పూజ హెగ్డే కూడా ప్రభాస్ కి జోడిగా బావుంటుందని... పూజ కూడా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ పక్కన 'మోహింజదారో' నటించింది కాబట్టి పూజ అయినా ఓకె అని అనుకుంటున్నారట.  మరో పక్క నాగ చైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో చేసిన మంజిమ మోహన్ కూడా సాహోలో ప్రభాస్ పక్కన బావుంటుందని అంటున్నారట. మరి 'సాహో' లో విలన్ గా చేస్తున్న నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని సీన్స్ ని తెరకెక్కిస్తున్నారట. అయితే సాహో షూటింగ్ త్వరలోనే రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ కానుందట. ఇక రామోజీలో ఆ షెడ్యూల్ మొదలవగానే హీరోయిన్ వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. చూద్దాం ఈ ముగ్గురిలో ఫైనల్ హీరోయిన్ ఎవరనేది.

Prabhas 'Saaho' Movie Heroines Update!:

Prabhas 'Saaho' is a film and is silent shooting start. Even though the shooting start, Prabhas is playing the role of a heroine is not a final. Next to Prabhas, the names of Anushka, Pooja Hegde and Manjima Mohan are strongly heard.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ