ఒకప్పుడు కథా బలంతోనే సినిమాలు హిట్ అవుతూ వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో కథా బలంతోనే సినిమాలు సూపర్ హిట్టయ్యేవి. అంత కథాబలం వున్న ఆ సినిమాల్లో కామెడీకి ఏ లోటు ఉండేది కాదు. అల్లు రామలింగయ్య, రేలంగి వంటి వారు కామెడీని సూపర్ గా పండించేవారు. వారి తరం తర్వాత బ్రహ్మనందం హావా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువైంది. అహా నా పెళ్ళంటా వంటి సినిమాలతో కామెడీకి మారుపేరు గా మారిపోయిన బ్రహ్మనందం నిన్నమొన్నటి వరకు ప్రతి ఒక్క సినిమాలో ఉండేవాడు. కేవలం బ్రహ్మీ కామెడీ కోసం ఆయనకు స్పెషల్ గా కేరెక్టర్స్ ని రెడీ చేసేవారు..... టాలీవుడ్ లో కొంత మంది దర్శకులు. అలాంటి బ్రహ్మీ కామెడీ ఇప్పుడు వెగటు పుట్టించేస్తుందని ఆయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒకటే ఫేస్ ఎక్సప్రెషన్స్ తో కనిపించాడని లాజిక్ లు తీస్తూ ఆయనకు సినిమా అవకాశాలు తగ్గడానికి ఇదే కారణమంటున్నారు.
ఇక తెలుగులో సునీల్, అలీ వంటి వారు కామెడీతో సినిమాలు నడిపించేవారు. కానీ సునీల్ హీరోగా సెటిల్ అవడంతో వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ తెరమీదకొచ్చారు. అలాగే జబర్దస్త్ పుణ్యమా అని ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొదవలేకుండా పోయింది. అయితే ఎవరూ బ్రహ్మీ స్థానాన్ని భర్తీ చెయ్యలేదు. కానీ ఇప్పుడు తాజాగా అమీ తుమీ సినిమాతో వెన్నెల కిషోర్ చేసిన కామెడీని చూసిన వారంతా వెన్నెల కిషోర్, బ్రహ్మీ కి రీప్లేస్ అంటూ ఇప్పుడు ప్రచారం మొదలైంది. అమీ తుమీ సినిమాలో హీరో హీరోయిన్స్ కేరెక్టర్స్ కంటే కమెడియన్ కేరెక్టర్ బలంగా ఉందని..... కామెడీ టైమింగ్ తో వెన్నెలా కిషోర్ చంపేశాడని అంటున్నారు. కేవలం వెన్నెల కామెడీతోనే ఆ సినిమా హిట్టయ్యిందనే ప్రచారమూ షురూ అయ్యింది.
ఇప్పటి వరకు చేసిన కామెడీ వేరు అమీ తుమీ లో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ వేరని....ఒక్క సినిమాతోనే డబుల్ క్రేజ్ కొట్టేశాడని .... బ్రహ్మీ ని రీప్లేస్ వెన్నెలా చేస్తాడనే కాన్ఫిడెన్స్ పెరిగిందని అంటున్నారు. మరి వచ్చే సినిమాల్లో కూడా కరెక్ట్ కామెడీతో వెన్నెల కిషోర్ ఆకట్టుకుంటే ఆయనకు టాలీవుడ్ లో తిరుగుండదని అంటున్నారు.