టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా చక్రం తిప్పుతున్న నాని వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. చేతిలో రెండు మూడు సినిమాలతో ఎప్పుడూ బిజీగా వుండే నాని కి వారసుడు కూడా పుట్టేసాడు. అయితే ఇప్పుడు నాని ఐదు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లోని గచ్చిబౌలి పరిసరప్రాంతంలో అత్యాధునికమైన ఒక విల్లాని కొనుగోలు చేసాడట. తన ఫ్యామిలీ కోసం ఇలా నాని అన్ని సదుపాయాలతో ఉన్న ఇంటిని కొనుగోలు చేసాడని దానికి సంబందించిన రిజిస్టేషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయినట్టు చెబుతున్నారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు క్రియేట్ చేసిన ఒక లగ్జరీ వెంచర్ లో భాగమైన ఈ విల్లాని నాని కొనుగోలు చేసాడట. మరి హిట్ సినిమాలతో భారీగా దండుకుంటున్న నాని ఇలా ఒక ఇల్లు కొనుక్కోవడం పెద్ద విషయమేమి కాదు. ఇక నాని తన కుటుంబంతో మంచి రోజు చూసుకుని కాలు పెట్టడమే తరువాయి. మిగతా అన్ని పనులు పూర్తయ్యాయని అంటున్నారు. ఇలా పెద్దమొత్తంలో ఆ ఇంటికోసం ఖర్చు పెడుతున్న నానిని చూస్తుంటే తన ఫ్యామిలీ కోసం నాని ఎంతో కష్టపడుతున్నాడనిపిస్తుంది కదా.
ఇప్పటికే టాలీవుడ్ కుర్రహీరోలు ఇలా సినిమాల మీద సినిమాలు చేస్తూ వారి కోసం లగ్ఝరి ఇళ్లను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ 2 కోట్లతో ఒక విల్లా ని కొనుగోలు చేసాడు. అలాగే ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న విజయ్ దేవరకొండ కూడా బంజారాహిల్స్ లో ఒక ఇల్లు కొనుక్కున్నాడట. సో.... మన టాలీవుడ్ హీరోస్ కాస్త సినిమాలు హిట్ కాగానే వేరే వాటికి డబ్బుని నీళ్లలా ఖర్చు పెట్టకుండా ఇలా ఇళ్ల కోసం ఖర్చు పెడుతున్నారన్నమాట.