అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథం' ఈ నెల 23 న విడుదల కాబోతుంది. ఇక సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నందున ఈ చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాలు షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ఈ ఆదివారం 'డీజే' ఆడియో వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకి 'డీజే' చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. ఇక 'డీజే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18 న కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. దువ్వాడ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ ని కొత్త డైరెక్టర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ - అల్లు అర్జున్ న్యూ మూవీ ఈ నెల 14 న అధికారికంగా సెట్స్ మీదకెళ్లబోతుందట. రామలక్ష్మి సిని క్రియేషన్స్ లో లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు.
అయితే వక్కంతం - బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా కన్నడ యాక్ట్రెస్ అయిన రష్మిక మడోన్నా ని ఎంపిక చేశారని చెబుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
కాగా ఆదివారమే స్వర్గీయ దాసరి పెద్ద కర్మ కావడంతో 'డిజె' పాటల వేడుకను ఆరోజే నిర్వహించనుండటంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆరోజు సాయంత్రం మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్‌లో విశాఖపట్టణం, అనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్ తయారుచేసిన దాసరి విగ్రహాన్ని ప్రతిష్టించనుండటంతో ఈ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.