Advertisementt

ఇంతకీ ఈ రాజు గారి అసలు భార్య ఎవరో?

Sun 11th Jun 2017 03:14 PM
nene raju nene manthri,rana daggubati,kajal agarwal,radha,rani,catherine tresa,teja  ఇంతకీ ఈ రాజు గారి అసలు భార్య ఎవరో?
Nene Raju Nene Manthri Interesting Posters ఇంతకీ ఈ రాజు గారి అసలు భార్య ఎవరో?
Advertisement
Ads by CJ

రానా హీరోగా తేజ దర్శకత్వంలో 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్ర టీజర్ ని ఈ మధ్యనే విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ తో ఆకట్టుకున్న 'నేనే రాజు - నేనే మంత్రి' ఇపుడు అందులో నటించే నటీనటుల లుక్స్ విడుదల చేసి సినిమాపై మంచి అంచనాలని పెంచింది . టీజర్ లో రానా 'నేనే రాజు- నేనే మంత్రి' అన్నట్టు.... ఈ చిత్రంలో రానాకీ జోడిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సాలు కూడా నేనే రాధని, నేనే రాణి అంటూ లుక్స్ తో చంపేస్తున్నారు.

కాజల్, కేథరిన్ కేరెక్టర్స్ ని రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ ని రివీల్ చేసింది చిత్ర యూనిట్. అందులో కాజల్ అగర్వాల్ ‘నేనే రాధ.. నేనే భార్య’ అంటూ చూడముచ్చటైన చీరకట్టుతో ఆకట్టుకోగా... కేథరిన్ ఏమో  ‘కాదు నేనే రాణి.. నేనే భార్య’ అంటూ మోడ్రన్ కట్టులో ఆకట్టుకుంటుంది. మరి వీరు చెప్పేదాన్నిబట్టి చూస్తుంటే రానాకీ రాధా, రాణి లు వీరిద్దరే అని అర్ధమవుతుంది. మరి హీరో రానా కోసం రాధా, రాణి కొట్టుకునేలా పోస్టర్స్ ని విడుదల చేశారు... మరి నిజంగా 'నేనే రాజు- నేనే మంత్రి' చిత్రంలో రానాకి రాణిగా ఎవరు ఉంటారు. మరి నేనే భార్య అంటూ ఇద్దరూ తన్నుకుచస్తుంటే చివరికి రానా భార్య ఎవరో అనేదాని మీద బాగా క్యూరియాసిటీని కలుగజేసింది చిత్ర యూనిట్.

బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అర్ధంకాక చాలా రోజులు ఆ సమాధానము కోసం వెయిట్ చేసిన వారికి బాహుబలి కంక్లూజన్ లో ఆన్సర్ దొరికినట్లు.... ఇప్పుడు 'నేనే రాజు - నేనే మంత్రి' విడుదలవగానే ఈ రాణి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందన్నమాట.

Nene Raju Nene Manthri Interesting Posters:

Rana plays title role in Nene Raju Nene Manthri. Kajal and Catherine Fights for Rana's Wife post. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ