రాహుల్‌గాంధీ ఇటీవలే సంగారెడ్డి, గుంటూరులకు వచ్చి సభలు నిర్వహించారు. ఆయన కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు. ఇంకా ఏపీలో, తెలంగాణలో ఎందరో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. దాసరి మామూలు వ్యక్తికాదు. ఆయన సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత మాత్రమేకాదు.. ఒకానొక దశలో ఓ సామాజిక వర్గానికి ప్రతినిధి. ఇక ఆయన రాజ్యసభలో ఎంపీగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. పార్టీలోని ఇతరులు చేసిన బొగ్గు మసి దాసరికి అంటుకుంది. కానీ వీరెవ్వరూ దాసరి మరణాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయనను కొంతకాలం కాపు ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. కాంగ్రెస్ తీరే అంత.
కానీ కాంగ్రెస్ వారు పట్టించుకోకపోయినా బిజెపిలో కీలకమైన వ్యక్తి, కేంద్రమంత్రిగా హవా చాటుతున్న వెంకయ్యనాయుడు మాత్రం దాసరిని ఓ కాంగ్రెస్ వాదిగానో, తమకు వ్యతిరేక సామాజిక వర్గం వాడనో చూడకుండా దాసరి ఇంటికి వచ్చి పరామర్శించి,దాసరిని చూసి ఓ తెలుగువాడిగా గర్విస్తున్నానని చెప్పడం అభినందనీయం. దాసరి ఏ పార్టీలో ఉన్నా అందరి గురించి ఆలోచించే పెద్దమనసు అని వెంకయ్య చెప్పాడు. కొందరు కుల ఓట్ల కోసం, అధికారంలోకి రావడానికి కుర్చీల వేటలో ఉంటారని కొందరిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వెంకయ్య...!