సుశాంత్ సింగ్, కీర్తి సనన్ జంటగా బాలీవుడ్ లో తెరకెక్కిన 'రాబ్తా' చిత్రం నిన్నటిదాకా సమస్యల వలయంలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు అన్ని సమస్యలు ముగిసిపోయి లైన్ క్లియర్ అయిపోయింది. ఈ 'రాబ్తా' సినిమా తెలుగు 'మగధీర' కు ఫ్రీమేక్ అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది 'మగధీర' కాపీ అంటూ 'మగధీర' నిర్మాత అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కాడు. ఎలాగైనా 'రాబ్తా' సినిమా విడుదలను ఆపాలని అరవింద్ ఇలా చేసాడని అన్నారు. అయితే ఉన్నట్టుండి లాస్ట్ మినిట్ లో అరవింద్ కేసు విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే సమస్యని కోర్టులో తేల్చుకునే కంటే కోర్టు బయట ఇరుపక్షాల వారి సెటిల్మెంట్ కి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సెటిల్మెంట్ లో 'మగధీర' నిర్మాతలకు 'రాబ్తా' సినిమా నిర్మాతలు కొంత మొత్తం ఆఫర్ చెయ్యడం వలనే ఇలా కేసు విత్ డ్రా చేసుకున్నారనే టాక్ వినబడుతుంది. అయితే 'రాబ్తా' సినిమా నిర్మాతలు 'మగధీర' నిర్మాతలకు ఎంత ముట్టజెప్పారనేది మాత్రం బయటికి రానియ్యడం లేదు. అసలు కేసు విత్ డ్రా అంటున్నారు గాని.. కోర్టు బయట సెటిల్మెంట్ అయిన వ్యవహారాన్ని మాత్రం బయటికి రానివ్వడం లేదు. ఏదైతేనేం 'రాబ్తా' సినిమా కు సమస్యలు మాత్రం తప్పినట్లే.