Advertisementt

అందుకే దిల్‌ రాజు గ్రేట్‌ అనేది...!

Sat 10th Jun 2017 02:06 PM
dil raju,producer dil raju,duvvada jagannadham,direction,dil raju about directors  అందుకే దిల్‌ రాజు గ్రేట్‌ అనేది...!
Producer Dil Raju Greatness అందుకే దిల్‌ రాజు గ్రేట్‌ అనేది...!
Advertisement
Ads by CJ

నేడున్న యువనిర్మాతల్లో దిల్‌రాజుది ప్రత్యేకశైలి. సినిమాలను జడ్జి చేయడంలో, కథను ఒడిసిపట్టుకోవడంలో, దర్శకులకు కావాల్సింది అందించడంలో, వేస్టేజ్‌ను నిలువరించడంలో, పబ్లిసిటీ, ప్రమోషన్‌ నుంచి అన్ని విషయాలలోనూ ఆయన నేడు గ్రేట్‌. ఇక నిర్మాతగా మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన అంతే సిద్దహస్తుడు. ప్రస్తుతం ఆయన బన్నీ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 23న విడుదలకు సిద్దమవుతోంది. 

తాజాగా దిల్‌రాజు మాట్లాడుతూ, హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో తాను మరో చిత్రం కూడా చేస్తానని తెలిపాడు. 'డిజె' (దువ్వాడ జగన్నాథం) విడుదలైన తర్వాత ఆ చిత్రం విశేషాలను తెలియజేస్తానన్నాడు. ఇక దర్శకులు తనకు సహకరిస్తే తాను తన కెరీర్‌లో 50చిత్రాలను ఖచ్చితంగా నిర్మిస్తానని చెప్పాడు. కానీ 100 చిత్రాలను నిర్మించడం మాత్రం తన వల్ల సాధ్యం కాదేమోనని ఒప్పుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 చిత్రాలు నిర్మించడమంటే అంత సులభం కాదని, దానిని తాను సాధించలేనని చెప్పాడు. 

ఇక తాను ఎన్ని చిత్రాలను నిర్మించినా, తనకు ఎంత అనుభవం వచ్చినా కూడా జీవితంలో మెగాఫోన్‌ మాత్రం చేతపట్టనని తేల్చిచెప్పాడు. దర్శకత్వం అనేది చిన్న విషయం కాదని, అహోరాత్రులు దాని గురించే ఆలోచిస్తూ, కష్టపడాలని, ఆ కష్టం తనకు తెలుసునని తేల్చిచెప్పాడు. దర్శకులు పడే కష్టం చూస్తే తనకు భయమేస్తుందని అన్నాడు. ఇలా.. తనకు ఇప్పటివరకు సినిమాలలో ఉన్న అనుభవం ద్వారా ఆయన ఇంత నిజాయితీగా తన మనసులోని విశేషాలను వెల్లడించడం గ్రేటేనని చెప్పవచ్చు. 

Producer Dil Raju Greatness :

Dil Raju Talks about Direction and His Films. Dil Raju Film Duvvada Jagannadham is Ready to Realese. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ