ఏడాదికి ఎవ్వరితో సంబంధం లేకుండా రెండు చిత్రాలు చేయడం మాస్‌మహారాజాకు అలవాటు. కానీ సిక్స్‌ప్యాక్‌లు, బాడీబిల్డింగ్‌లు, బరువు తగ్గడానికి చేసిన పనుల పుణ్యమా అని అతనిలో ముందున్న గ్రేస్ పోయింది. దాంతో 'బెంగాల్‌టైగర్' తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఇక ఆ మధ్య వేణు శ్రీరామ్, దిల్‌రాజుల 'ఎవడో ఒకడు', విక్రమ్‌సిరి, చందుమొండేటి వంటి దర్శకులను ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయించాడు. చివరకు దిల్‌రాజు-వేణుశ్రీరామ్‌ల దర్శకత్వంలోనే రాజా దిగ్రేట్, కొత్త దర్శకుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు చిత్రాలు ఒప్పుకుని రెండింటిని సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు.
ఇక దిల్‌రాజు 'రాజా దిగ్రేట్' విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఆ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలి? ఎప్పుడు రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది? అనే విషయాలు రాజుకి తెలుసు. కానీ కొత్త దర్శకుడు విక్రమ్‌సిరితో రవితేజ చేస్తున్న 'టచ్ చేసి చూడు' షూటింగ్ సగం పూర్తయిందని, కాబట్టి ఎలాగైనా ఈ చిత్రాన్ని దసరా రేసులో దించాలని భావిస్తున్నారు. బహుశా సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
కానీ ఈసారి దసరాకు పెద్ద పెద్ద హీరోలు సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. బాలయ్య-పూరీల చిత్రం సెప్టెంబర్29న విడుదల కానుంది. ఎన్టీఆర్-బాబిల చిత్రం సెప్టెంబర్1న 'జనతాగ్యారేజ్' రోజే విడుదల కానుంది. ఇక మహేష్ 'స్పైడర్', పవన్-త్రివిక్రమ్ వంటి వారందరూ దసరాపైనే దృష్టి పెట్టారు. చరణ్-సుక్కు చిత్రం కూడా సెప్టెంబర్‌లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి వీరందరి మధ్యలో చాలా గ్యాప్ తర్వాత మాస్‌మహారాజా వస్తే మడత ఖాజానే అంటున్నారు.