Advertisementt

నాగ చైతన్య లీక్ చేసేశాడు...!

Thu 08th Jun 2017 09:51 PM
naga chaitanya,samantha,naga chaitanya and samantha marriage date,chaitu and samantha marriage details,goa  నాగ చైతన్య లీక్ చేసేశాడు...!
Naga Chaitanya Reveals Date of His Wedding నాగ చైతన్య లీక్ చేసేశాడు...!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత లు గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం మాత్రం గత ఏడాదే బయటికి వచ్చింది. ఇక వీరి ప్రేమ వ్యవహారం బయటికి వచ్చినప్పటినుండి వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా ఓపెన్ గానే విహరించడం మొదలు పెట్టేసారు. ఈ ఏడాది మొదట్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ తమ తమ సినిమాలతో బిజీ అయ్యారు. ఇక పెళ్లి విషయం మాత్రం దాటవేస్తూ వస్తున్న ఈ జంట ఈ అక్టోబర్ లోనే పెళ్లిపీటలెక్కబోతుంది. అక్టోబర్ 6  వ తేదీన గోవా లో తమ పెళ్లి జరగబోతున్నట్టు నాగ చైతన్య మీడియాకి తెలియజేశాడు. అక్టోబర్ 6  వతేదీన గోవా లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల పద్దతిలో సమంతని చైతు పెళ్లి చేసుకోబోతున్నట్టు మీడియాకి తెలిపాడు.

పెళ్లిపీటలెక్కుతున్న ఈ జంట తమ తమ సినిమాల షూటింగ్ లకు మూడు నెలలు బ్రేక్ ఇస్తారని సమాచారం. ఇప్పటికే నాగ చైతన్య 'రారండోయ్ వేడుక చేద్దాం' విడుదల కాగా కృష్ణ మరిముత్తు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చెయ్యాలని చైతు భావిస్తున్నాడు. అలాగే సమంత కూడా టాలీవుడ్ లో ఒప్పుకున్న మూడు సినిమాలను వీలైతే త్వరగా కంప్లీట్ చేయ్యాలనుకుంటుందని,  ఒకవేళ షూటింగ్ బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఆ మూడు నెలలు గ్యాప్ తర్వాతే ఆ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుందట. ఇప్పటికే సమంత ఒప్పుకున్న 'రాజుగారి గది 2' సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా రామ్ చరణ్ చిత్రం, 'మహానటి సావిత్రి' చిత్రాలు సెట్స్ మీదున్నాయి. 

Naga Chaitanya Reveals Date of His Wedding:

Chaitu got the news broken out. He disclosed that he would get married to Samantha on October 6. And it's going to be the Hindu and Christian traditional wedding. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ