ప్రముఖ అవార్డు ఫంక్షన్లకు, వేడుకలకు హోస్ట్‌గా స్టార్స్ పనిచేసే సంస్కృతి బాలీవుడ్‌లో బాగా ఉంది. షారుఖ్-హృతిక్-సైఫ్‌లతో పాటు పలువురు ఇలా పనిచేశారు.. చేస్తూనే ఉన్నారు. ఇక ఈ తరహా సాంప్రదాయం తెలుగులో లేదు. మన స్టార్స్ దానిని ఏదో నామోషీగా ఫీలవ్వడం వల్లే ఈ పద్దతి పెద్దగా టాలీవుడ్‌లో కనిపించదు.
కానీ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో మొదలైంది. సీనియర్ స్టార్స్ కాకపోయినా కుర్రహీరోలు దీనిపై బాగానే మనసు పెడుతున్నారు. ఆమద్య అల్లుశిరీష్-నవదీప్‌లు హోస్ట్‌గా చేసిన కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత నాని-రానాలు కూడా ఈ తరహా కార్యక్రమం చేశారు. అది సూపర్‌హిట్ అయింది. హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నప్పటికీ అల్లుశిరీష్ మాత్రం ఇలాంటి వేడుకల్లో స్పాంటేనియస్‌గా సెటైర్లు, పంచ్‌లు విసురుతూ తన ప్రత్యేక పంధా చాటుతున్నాడు. ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్సును ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవార్డు వేడుకకు మరోసారి అల్లుశిరీష్‌తో పాటు మరో యువహీరో విజయ్‌దేవరకొండ హోస్ట్‌గా చేయడానికి ఓకే చేశాడు. దీనికిగాను వారికి భారీగానే అమౌంట్ ముట్టనుంది.
ఈ వేడుకకు దక్షిణాది సినీ ప్రముఖులందరూ హాజరుకానున్నారు. పోటీ కూడా బాగా ఉంది. తెలుగు విభాగంలో కూడా మంచి ఫైట్ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే హోస్ట్‌గా అనుభవం ఉన్న శిరీష్‌తో ధీటుగా ప్రోగ్రాంను రక్తికట్టించేందుకు విజయ్ సాధన చేస్తున్నాడట.