అప్పుడెప్పుడో అనుష్క టాలీవుడ్ లో ఒక నిర్మాతను పెళ్ళాడుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అది ఒట్టి రూమర్ అని.... ఇప్పుడు సహనటుడు ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు సోషల్ మీడియాలో బాగానే ప్రచారం అయ్యాయి. 'బిల్లా, మిర్చి, బాహుబలి' వంటి చిత్రాలలో ఇద్దరూ కలిసి నటించడంతో ఈ గాసిప్స్ ఇంకా పెరిగిపోయాయి. ఇక బాహుబలి సినిమా విడుదలకు ముందు వెనుక ప్రభాస్, అనుష్క సినిమా ప్రమోషన్స్ లో కనబడినప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారేమో? అని ప్రచారం బాగా జరిగింది. ఎందుకంటే వీరిద్దరూ సినిమా ప్రమోషన్ లో భాగంగా క్లోజ్ గా ఉండడం, రీల్ కెమిస్ట్రీతో కంటే రియల్ కెమిస్ట్రీతో ఎక్కువగా కనిపించడం వంటి అంశాలు ఈ రూమర్స్ కి బలం చేకూర్చాయి.
ఇక ఎలాగూ ప్రభాస్ కు పెళ్లి వయసు దాటిపోతుంది... అనుష్క కి కూడా పెళ్లి వయసు దాటిపోయి చాలా కాలమే అయ్యింది... కనుక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుందని కూడా వార్తలు ప్రచారం జరిగాయి. అలాగే అసలు వీరిమధ్యన ఏదో ఉందని అందుకే వీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని.... వీరి ప్రేమకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వలెనే వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని ప్రచారం షురూ అయ్యింది. అయితే ఈ పెళ్లి వార్తలకు స్పందించిన అనుష్క బాగా కోపం వచ్చేసిందట. ప్లీజ్ దయచేసి ఇలాంటి వాటిని ప్రచారం చెయ్యకండి ఇక ఆపెయ్యండి. ప్రభాస్ నా సహనటుడు మాత్రమే. మామధ్యన ఇంకేం లేదూ... ఒకవేళ ఈ గాసిప్స్ ని ఆపలేదో చట్టప్రకారం ప్రొసీడవుతానంటూ హెచ్చరికలు జారీచేస్తుంది.
మరి అనుష్క ఇలా హెచ్చరించే బదులు మంచి వరుణ్ణి చూసి ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటే ఇలాంటి రూమర్స్ ఆగుతాయి లేకుంటే...మరిన్ని రూమర్స్ అనుష్క మీద ప్రచారం జరిగేలా వున్నాయి. ఏదైనా అనుష్క బాగా అలోచించి పెళ్లి మీద ఒక నిర్ణయం తీసుకుంటే బావుంటుంది.