బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'క్వీన్' చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. కంగనాకు బోలెడంత పేరు తెచ్చిపెట్టడమే కాక జాతీయ స్థాయిలో అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించాక ఇక్కడ తమిళం, తెలుగులో కూడా 'క్వీన్' చిత్రానికి రీమేక్ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు సౌత్ నిర్మాతలు. అప్పట్లో క్వీన్ పాత్రకు గాను చాలామంది హీరోయిన్ పేర్లే వినబడ్డాయి. అప్పట్లో అది పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చెయ్యడానికి నటుడు, నిర్మాత అయిన త్యాగరాజన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకే తమిళ రీమేక్ రైట్స్ ని కూడా కొనుగోలు చేశాడు. అయితే హీరోయిన్ గా తమన్నాని తీసుకుందామనుకుని సినిమా మొదలు పెట్టె ప్రయత్నాలు కూడా చేశారు. కానీ తమన్నాకి చిత్ర నిర్మాతకు రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో తమన్నా ఈ ప్రాజెక్ట్ నుండి సైడ్ అయ్యింది. తమన్నా సైడ్ అయ్యాక ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరినట్టు తమిళ వర్గాల భోగట్టా. తమన్నా స్థానంలోకి కాజల్ ని తీసుకుంటే బావుంటుందని త్యాగరాజన్ ఆలోచిస్తున్నాడట.
ఈ విషయమై ప్రస్తుతం కాజల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. చూద్దాం క్వీన్ గా కాజల్ కనబడుతుందో... లేకపోతె మరెవరన్నా ఆ పాత్రని దక్కించుకుంటారో?