Advertisementt

శృతి హాసన్ ఘాటైన సమాధానం ఇచ్చింది!

Wed 07th Jun 2017 07:27 PM
shruti haasan,tollywood,bollywood,kollywood,behan hogi tari movie  శృతి హాసన్ ఘాటైన సమాధానం ఇచ్చింది!
Shruti Haasan Gave A Strong Answer..! శృతి హాసన్ ఘాటైన సమాధానం ఇచ్చింది!
Advertisement
Ads by CJ

తెలుగులో 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఫామ్ లో కొచ్చిన శృతి హాసన్ తమిళంలోనూ స్టార్ హీరోయినే. తెలుగు, తమిళం, హిందీ భాష తేడా అనేది లేకుండా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ ఈ మధ్యన కాస్త ఒళ్ళు చేసింది. అటు ఒళ్ళు చెయ్యడమే కాకుండా ఇటు విమర్శకుల నోటికి బాగా పని చెప్పింది. 'కాటమరాయుడు' చిత్రంలో శృతి హాసన్ లావుగా కనిపించిందని విమర్శలు ఉన్నాయి. మరోపక్క ఇప్పుడు తమిళంలో భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ నుండి సిల్లీ కారణంగా శృతి తప్పుకోవడం కూడా కోలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే తాజాగా శృతి బాలీవుడ్ లో ‘బెహన్ హోగి తేరి’ నటించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న శృతి తనపై వస్తున్న విమర్శలకు ఘాటైన జవాబులిచ్చింది. ఈ మధ్య కాస్త బరువు పెరిగి లావుగా కనిపించడం, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వంటి విమర్శలపై మీరెలా స్పందిస్తారని శృతిని అడగ్గా... దానికి శృతి సినిమాల్లో నటిస్తున్న మేము అందంగా కనబడాలంటే రకరకాల ప్రయత్నాలు చెయ్యాల్సి ఉంటుంది. 

నేను బరువు  ‘బెహన్ హోగి తేరి’చిత్రం కోసం కావాలనే పెరిగాను. ఒక్కకప్పుడు మన ప్రమేయం లేకుండానే బరువు పెరుగుతుంటాం. ఇది నా బాడీ... నా శరీరంతో నేనేం చేస్తాననే విషయం ఎవరికీ అవసరంలేదు. అలాగే నేను ఎటువంటి విమర్శలను పట్టించుకోనని... ఘాటైన సమాధానం ఇచ్చింది శృతి హాసన్.

Shruti Haasan Gave A Strong Answer..!:

Shruti Haasan in Telugu with the film 'Gabbar Singh' is a star heroine in Tamil. Shruti Haasan, who is doing films without any difference in Telugu, Tamil and Hindi, has made a little bit in the past. Latest Shruti haasan Bollywood has starred in 'Behan Hogi Tari'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ