Advertisementt

దాసరి తొందరపడ్డారా..?

Wed 07th Jun 2017 06:25 PM
late dasari narayana rao,daughter neerajitha,dasari surgery  దాసరి తొందరపడ్డారా..?
Dasari Daughter Told About Dasari Narayana Rao Surgery దాసరి తొందరపడ్డారా..?
Advertisement
Ads by CJ

సినిమా వ్యక్తులు లావుగా ఉంటే దానిని తగ్గించుకోవడానికి సహజమైన పద్దతులను కాకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. గతంలో హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌ విషయంలో కూడా అదే జరిగింది. తాజా సమాచారం ప్రకారం దాసరి కూడా డాక్టర్లు బరువు తగ్గమని సూచించడంతో 75ఏళ్ల వయసులో ఆ సర్జరీ చేయించుకున్నారని అంటున్నారు. తాజాగా ఆయన కుమార్తె చెప్పిదాని ప్రకారం తక్కువ తినడానికి, బరువు తగ్గడానికి నాన్న సర్జరీ చేయించుకున్నారు. 

జనవరిలో కూడా బెలూన్‌తో మరోసారి సర్జరీకి వెళ్లారు. కానీ మొదటిసారి అపరేషన్‌ చేసిన డాక్టర్‌ లేరు. మరో డాక్టర్‌ సర్జరీ చేశారు. ఏదో తేడా వచ్చింది. దాంతో సీరియస్‌ అయింది. డాక్టర్ల వద్దకు వెళ్తే సర్జరీ ఫెయిలైందని, అన్నవాహికకు బెజ్జం పడిందని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని చెప్పారు. అప్పటి నుంచి ప్రోసీజర్ల మీద ప్రొసీజర్లు, సర్జరీల మీద సర్జరీలు జరిగాయి. ఎలాగోలా బయట పడి మార్చి 28న ఇంటికి వచ్చారు. 

కడుపుకు రంద్రం చేసి ట్యూబ్‌ ద్వారా ద్రవాహారం ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కానీ నోటి ద్వారా తినేందుకు అన్నవాహికను పునర్నిర్మించే సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. దాని కోసమే మే మూడవ వారంలో తిరిగి ఆసుపత్రిలో చేరారు. పెద్దపేగును కట్‌ చేసి, అన్నవాహికను పునర్నిర్మించే సర్జరీ చేశారు. తీరా అది ఫెయిలైంది. చిన్నచిన్నగా అన్ని అవయవాలు చెడిపోయాయి.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Dasari Daughter Told About Dasari Narayana Rao Surgery:

If the cinematography is bold, the surgeon is doing more than natural methods to cut it down. Recently, his daughter said he had a nurse surgery to eat less and lose weight. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ