సామాన్యంగా బాలీవుడ్‌లోనే రంజాన్ సందడి ఉంటుంది. ప్రతి రంజాన్‌కు తన సినిమా ఒకదానిని రిలీజ్ చేసి, అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడం సల్మాన్‌ఖాన్ అలవాటు. ఈ ఏడాది ఆయన 'ట్యూబ్‌లైట్' విడుదల చేస్తున్నాడు. ఇక మిగిలిన ఇద్దరు ఖాన్‌లు కూడా తమ చిత్రాల అప్‌డేట్స్‌నో లేక ఏదో ఫస్ట్‌లుక్‌నో, టీజర్‌నో రిలీజ్ చేస్తుంటారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే కేవలం హిందు పండుగలు, జనవరి 1, లవర్స్ డే, స్వాతంత్య్రదినోత్సవ కానుక లేదా గణతంద్ర దినోత్సవం వంటి వాటిని తమ పుట్టినరోజులను టార్గెట్ చేస్తుంటారు.
ఇక ఇంతకాలం మన స్టార్స్ కులాల వారీ రాజకీయాలు చేశారు. రాయలసీమ, నైజాం, ఆంధ్రా అంటూ టార్గెట్ చేశారే గానీ మతాల ఛాయలకు వెళ్లలేదు. కాగా గతంలో సూపర్‌స్టార్ కృష్ణకు ఎక్కువమంది ముస్లిం అభిమానులుండేవారు. ఆ తర్వాత వారు మహేష్‌బాబుకు చేరువయ్యారు. తాజాగా రాజకీయ నాయకుల వలే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ముస్లిం అభిమానులపై పెద్ద కన్నేవేశాడంటున్నారు.
గతేడాది రంజాన్ కానుకగా 'జనతా గ్యారేజ్' టీజర్‌ను లాంచ్ చేశాడు. అందునా అందులో ముస్లింటోపీతో కనిపించి ముస్లింలను ఆకట్టుకున్నాడు. ఇక ఈ ఏడాది రంజాన్ కానుకగా సెంటిమెంట్‌గా చేస్తున్నాడో లేక మరీ రాజకీయ నాయకుడిలా రంజాన్ తోఫా ఇస్తున్నాడో గానీ త్వరలో రానున్న రంజాన్ కానుకగా 'జై లవకుశ' టీజర్ లాంచ్ చేయనున్నాడట. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.