తాజాగా టీం ఇండియా క్రికెట్ జుట్టుకు హెడ్‌కోచ్‌గా ఉన్న అనిల్‌కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో బిసిసిఐ కొత్తకోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పదవి కోసం ఆస్ట్రేలియ్ క్రికెటర్ టామ్ మూడీతోపాటు పైబస్ ర్ , దొడ్డగణేష్, లాల్‌చంద్ రాజ్‌పుత్, సెహ్వాగ్‌లు అప్లికేషన్స్ పెట్టారు. ఇక ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న అనిల్‌కుంబ్లే ప్రస్తుత కోచ్‌గా నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకానున్నాడు. ఇక నూతన క్రికెట్ కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యతలను బిసిసిఐ పాలక మండలి క్రికెట్ సలహా సంఘంలో ఉన్న సౌరవ్ గంగూలీ, సచిన్‌టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్‌లకు అప్పగించింది.
ఇక ఈ పదవి కోసం సెహ్వాగ్ చేసుకున్న దరఖాస్తును చూసి కోచ్ ఎంపిక సభ్యులు కంగుతిన్నారు. నా పేరు సెహ్వాగ్.. ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా, మెంటారుగా వ్యవహరించాను. ప్రస్తుతం క్రికెట్ టీంలో ఉన్న ఆటగాళ్లలో దాదాపు అందరితో ఆడిఉన్నాను... అనే మూడే మూడు వాక్యాలలో సెహ్వాగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడట. దీనితో పాటు అసలు అతను తన రెజ్యూమ్‌ని, బయోడేటాను కూడా జతపరచకపోవడంతో గంగూలీ, సచిన్, లక్ష్యణ్‌లు ఖంగుతిన్నారట. తన ఆటతీరులాగే తన వ్యవహారశైలి కూడా కట్టె, కొట్టె, తెచ్చె.. అన్నట్లు వ్యవహరించిన సెహ్వాగ్ దరఖాస్తు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.