ఎంతో ధైర్యంతో, ఎంతో సాహసంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకకడకుండా రాజమౌళి ఏది అడిగినా సరే కాదనకుండా సమకూర్చిన బాహుబలి నిర్మాతలు ఇప్పుడు బాహుబలి విజయంతో ఎంతో సంతోషంలో ఉన్నారు. బాహుబలిని రెండు పార్టులాగా నిర్మించిన వీరు ఆ సినిమా సక్సెస్ తో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు . తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి చిత్రం. 1500 కోట్ల మార్కును క్రాస్ చేసి 2000 కోట్లను కొల్లగొట్టడానికి పరుగులు తీస్తున్న బాహుబలి చిత్ర నిర్మాతల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏలాంటి స్టార్ హీరోతో ఉంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
ఆర్కా మీడియా వారు ఈసారి బాహుఅలికి మించిన చిత్రాన్ని నిర్మిస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో బాహుబలి నిర్మాతలైన ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు కొట్టేసిన శర్వానంద్ తో ఒక చిత్రం చేయబోతున్నారట. వరుస హిట్స్ తో కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న శర్వానంద్ ఈ ఏడాది ప్రథమార్ధంలో శతమానం భవతి హిట్ తో సంక్రాతి హీరో అనిపించుకున్నాడు. ఇక మొన్నామధ్యన విడుదలైన రాధ ప్లాప్ తో కాస్త డీలా పడ్డాడు. అయితే ఇప్పుడు తాజాగా శర్వానంద్ రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ డైరెక్టర్ గా ఆర్కా మీడియా నిర్మాతలతో పనిచెయ్యనున్నాడట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే పూజా కార్యక్రమాలతో మొదలవుతుందని సమాచారం.