'బడిలో.. ఒడిలో.. మదిలో..' అంటూ అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై ఒక రొమాంటిక్ సాంగ్ ని భారీ ఖర్చు తో 'డిజె ...దువ్వాడ జగన్నాధం' చిత్రం కోసం తెరకెక్కించారు. ఈ పాట కోసం అరబ్ కంట్రీస్ వెళ్లి న్యూ లొకేషన్స్ లో ఈ పాట చిత్రీకరణ జరపడానికి చాలానే కష్టపడింది డిజె టీమ్. అప్పట్లో అరబ్ వెళ్లిన బన్నీకి అక్కడ క్లైమేట్ కారణంగా మొహానికి ఏదో అలర్జీ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. దేవిశ్రీ భీభత్సమైన మ్యూజిక్ అందించిన ఈ పాటలో పూజ హెగ్డే అందాలతో పాటు అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ అదిరిపోయానే కామెంట్స్ కూడా పడ్డాయి. మరి అంతలా పాపులర్ అయిన పాట బ్రాహ్మణులకు మాత్రం రుచించడం లేదు. కారణం ఆ పాటలో వాడిన పదాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉండడమే.
అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే దిల్ రాజు నిర్మించాడు. అయితే బ్రాహ్మణ సంఘాలు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన డైరెక్టర్ గారు నేనూ ఒక బ్రాహ్మణుడినే.... నేనెందుకలా బ్రాహ్మణులను కించపరిచేలా సినిమా చేస్తా.. అంటూనే ఇంత ఖర్చు పెట్టి ఒక వర్గం వారిని కించ పరుస్తామా..సినిమా షూటింగ్ అయ్యాక అన్ని విషయాలు మాటాడదామని చెప్పాడు. కానీ ఊరుకొని బ్రాహ్మణులు సెన్సార్ బోర్డు కి కంప్లైంట్ కూడా చేసేశారు. అయితే ఇంతలా ముదురుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. మరి ఇంత భారీగా బడ్జెట్ పెట్టిన ఈ చిత్రం ఇలాంటి వివాదాలతో రచ్చకెక్కడం ఇష్టం లేక దిల్ రాజు ఆపాటలోని పాదాలను తొలిగించడానికి ఒప్పుకున్నాడు. మరలా ఆ పాటను కొత్తగా విడుదల చేస్తారని చెబుతున్నారు.మరి ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్న 'డిజె దువ్వాడ జగన్నాధం' చిత్రం ఇంతటితో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టిందనే అనుకోవచ్చా...? లేకపోతె మళ్లీ అనేది... వెయిట్ అండ్ సి...!