Advertisementt

వారిద్దరూ మరోసారి కలవబోతున్నారా..?

Tue 06th Jun 2017 03:19 PM
rajinikanth,malayalam super star,mammootty,kaala movie,key role  వారిద్దరూ మరోసారి కలవబోతున్నారా..?
Mammootty to Pley Key Role in Rajinikanth Kaala!! వారిద్దరూ మరోసారి కలవబోతున్నారా..?
Advertisement
Ads by CJ

సూపర్  స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'కాలా కరికాలన్' చిత్రం 'కబాలి' డైరెక్టర్ రంజిత్ పా డైరెక్షన్ లో ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.  ఈ చిత్రం షూటింగ్ ముంబై వీధుల్లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ వన్డర్ బార్  ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. రజినీ ఈ చిత్రంలో ముంబై మాఫియా డాన్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం రజిని 'కాలా' చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  

అయితే 'కాలా' చిత్రంలో మామ్మూట్టి ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే 26 ఏళ్ళ క్రితం మమ్ముట్టి, రజినీకాంత్ మణిరత్నం డైరెక్షన్ లో 'దళపతి' చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు మరోసారి 'కాలా' చిత్రంలో కలిసి నటించనున్నారని కోలీవుడ్ మీడియా చెబుతున్నమాట. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి నటిస్తుండగా...నానా పాటేకర్ విలన్ గా కనిపించనున్నాడు. రంజిత్ పా ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ 'కాలా' చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

Mammootty to Pley Key Role in Rajinikanth Kaala!!:

Kollywood media sources is Malayalam Super Star Mammootty is given a fresh call to join Kaala in a special character etched on the lines of Dr BR Ambedkar.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ