పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ చిత్రం సెట్స్ మీదున్నది. వీరిద్దరి కాబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇక ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రంపై కూడాబోలెడన్ని అంచనాలున్నాయి. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తున్నారు. ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నది.
ఈ చిత్రం షూటింగ్ యమా స్పీడుగా జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షడ్యూల్ షూటింగ్ ని కూడా మొదలుపెట్టేసుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఒక ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే పవన్ - త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ డేట్ మరియు సినిమా రిలీజ్ డేట్స్ ని లాక్ చేసేశారట. తొందరలోనే ఆ డేట్స్ ని చిత్ర యూనిట్ ప్రకటిస్తుందని చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.