పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో చేసే సినిమాతో సినిమాలకు బ్రేక్ ఇస్తాడని ఒకపక్కన ప్రచారం జరుగుతుండగా.... కాదు కాదు పవన్ మాస్ డైరెక్షర్ వి వి వినాయక్ తో ఒక మాస్ చిత్రం చేస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియా, వెబ్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు వినాయక్, పవన్ కళ్యాణ్ ని కలవడం ఒక స్టోరీ వినిపినించడం... పవన్ కూడా స్టోరీ తో ఇంప్రెస్స్ అయ్యి సినిమాకి గ్రీన్ ఇగ్నల్ ఇచ్చాడనే ప్రచారం మాములుగా జరగలేదు.
అయితే వినాయక్ తో పవన్ మాస్ చిత్రమనేది ఒట్టి రూమరేనట. అసలు వీరి కాంబినేషన్ మూవీ అని ఎక్కడా అనుకోలేదని.... ప్రస్తుతం కథలు గట్రా వినేందుకు పవన్ ఎవరికి అందుబాటులో లేడని పవన్ సన్నిహితులు చెబుతున్న మాట. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్..... ఆ సినిమా కోసం కాస్త సన్నబడడం కోసం... బరువు తగ్గించే ప్రయత్నంలో బెంగుళూరులో ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే త్రివిక్రమ్ షూటింగ్ లో పాల్గొంటూనే పవన్ ఇలా బరువు తగ్గించే ప్రయత్నాలు చేపట్టాడట.