బాలకృష్ణ 151వ చిత్రం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో తెరెకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలయ్య కాస్త రఫ్ గా గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్నాడని వినికిడి. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలని తనదైన శైలిలో యమా ఫాస్ట్ గా తెరకెక్కించే పూరి జగన్నాథ్ బాలకృష్ణ మూవీ ని కూడా అంతే ఫాస్ట్ గా తెరక్కేయించేస్తున్నాడు. అందుకే సెప్టెంబర్ 29న రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసేశాడు. ఈ చిత్రంలో బాలయ్య గెటప్ అంటూ ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఆ పిక్ లో బాలకృష్ణ డాన్ లా గెడ్డం పెంచేసి... భారీ మేకప్ తో నిజంగానే ఒక ఉస్తాద్ లా కనిపిస్తున్నాడు. చాలా రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ అంటూ ఏం ఫైనల్ చెయ్యలేదు పూరి జగన్నాధ్. అయితే బాలయ్య - పూరి చిత్రానికి రెండు మూడు టైటిల్స్ ఎప్పటినుండో ప్రచారంలో వున్నాయి.'జై బాలయ్య.. ఉస్తాద్.. తేడా సింగ్' అనే టైటిల్స్ బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ టైటిల్స్ సే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. మరి ఈ మూడు టైటిల్స్ లో ఏ టైటిల్ అయినా బాలయ్య బాబు కి బాగానే ఉంటుందని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారట.
అయితే ఈ మూడు టైటిల్స్ కంటే 'తేడా సింగ్' అనే టైటిల్ లో పూరి మార్క్ కనబడుతుందని... ఎప్పుడూ నెగెటివ్ టైటిల్స్ కి ఓటేసే పూరి ఇప్పుడు బాలయ్య సినిమాకి ఇదే టైటిల్ ని ఎంచుకుంటాడనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇక బాలయ్య చేసే గ్యాంగ్ స్టార్ పాత్ర కాస్త డిఫరెంట్ గా ఉంటుందని.... అంటే రొటీన్ లా వుండే గ్యాంగ్ స్టార్ కి ఈ బాలయ్య గ్యాంగ్ స్టార్ రోల్ కి బాగా తేడా ఉంటుందని.... అందుకే ఈ చిత్రానికి 'తేడా సింగ్' అనే టైటిల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని అంటున్నారు. మరి ఫైనల్ గా బాలయ్య చిత్రానికి ఏ టైటిల్ ఫైనల్ కానుందో మరికొద్ది రోజులు అంటే జూన్ 9న తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ శరణ్, కూస్కాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.